India vs Ireland Dream11 Team Tips: ఐర్లాండ్‌పై తొలి టీ20లో నెగ్గిన భారత్.. సిరీస్‌పై కన్నేసింది. నేడు డబ్లిన్‌లోని ది విలేజ్‌ వేదికగా రెండో మ్యాచ్‌లో తలపడనుంది. అయితే రెండో టీ20లోనూ వర్షం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తోంది. రీఎంట్రీలో అదగొట్టిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు తోడు మిగిలిన బౌలర్లు అందరూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. బ్యాట్స్‌మెన్లకు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి..? రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


డబ్లిన్‌లోని ది విలేజ్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్. అయితే గత మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే.. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వరుణుడు కరుణిస్తే.. పూర్తిస్థాయిలో మ్యాచ్‌ జరుగుతుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. 


వేదిక: డబ్లిన్‌లోని ది విలేజ్‌
సమయం: రాత్రి 7.30 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: స్పోర్ట్స్-18 నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జియో సినిమా యాప్‌లో కూడా చూడొచ్చు.


ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)


టీమిండియా: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్.


ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్‌బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, బెన్ వైట్.


డ్రీమ్11 టీమ్ టిప్స్.. 


వికెట్ కీపర్: సంజు శాంసన్, ఎల్.టక్కర్


బ్యాట్స్‌మెన్: పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ (కెప్టెన్), తిలక్ వర్మ


ఆల్ రౌండర్లు: కర్టిస్ కాంఫర్


బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, జోష్ లిటిల్


Also Read:  Anasuya: వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం ఇదేనా..?


Also Read: Asia Cup 2003: ఈ నెల 21న ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. ఈ ప్లేయర్లు ఉంటారా..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook