Anasuya Bharadwaj Crying Video: సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ ఏడ్చిన వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమెపై ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్‌తో కొందరు ఎప్పుడూ రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు సడెన్‌గా వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియోను షేర్ చేయడంపై నెటిజన్లు షాక్ గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ను రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌ను చూసి అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్ట్‌లో ఏముందంటే..
"హాయ్..! మీరందరూ మంచి ఆరోగ్యంతో.. సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నా. ఈ పోస్ట్‌కి మీరందరూ చాలా గందరగోళంలో ఉన్నారని నాకు తెలుసు. మొదట్లో సోషల్ మీడియాను నాకు తెలిసినంత వరకు ప్లాట్‌ఫారమ్‌లు కమ్యూనికేషన్లు పెంచుకోవడానికి.. సమాచారం కోసం వాడే వాళ్లం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను ఎందుకు వాడుతున్నాం..? మన బాగు కోసమే వాడుతున్నామా..? ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండండి. సమాచార విషయాలను పంచుకోండి. ఇతరుల జీవనశైలి, సంస్కృతులను తెలుసుకోండి. కానీ సోషల్ మీడియాను వాడుతున్న తీరును చూస్తుంటే.. నేను ఆశ్చర్యపోతున్నాను.
ఈ పోస్ట్ ఉద్దేశం ఏమిటంటే.. అన్ని పోజులు.. ఫోటోషూట్‌లు.. చిరునవ్వులు.. చిందులు.. బలమైన కౌంటర్లు.. పునరాగమనాలు మొదలైనవి నా జీవితంలో ఒక భాగమే.. మీరు కూడా అలానే ఉన్నారు.. కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను.. అలాగే నా జీవితంలోని నేను కష్టాలు ఎదుర్కొన్న సందర్భాల గురించి.. ఇలా ఏడుస్తున్న విషయాలను ఎక్కువగా చెప్పుకోలేదు.
ఈ విషయాలను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.. నా అభిప్రాయాలను నేను ఎప్పుడు కూడా నిక్కచ్ఛిగా చెబుతా. అయితే కొన్నిసార్లు నాపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆ ట్రోల్స్ గురించి నాలో నేను రెండు మూడు రోజులు బాధపడి.. తిరిగి నవ్వుతూ మీ ముందుకు వస్తున్నాను. విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అవుతా గానీ.. సమస్యల నుంచి పారిపోను. అందరి పట్ల దయ ఉండాలని అందరినీ కోరుతున్నా..
ఎదుటి వారు మనకు ఏం చేసినా సరే.. వారిపై దయను చూపించండి.. వారికి సమస్యలు వస్తే అండగా ఉండండి.. వాళ్లే తిరిగి మీ వద్దకు వస్తారు.. నేను కూడా ఇప్పుడు అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.." అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. ఐదు రోజుల క్రితం తనకు బాగా లేకపోతే.. ఇలా రికార్డ్ చేసి మెమోరీగా పెట్టుకున్నానని వెల్లడించారు. అయితే పోస్ట్ చివరి వరకు కూడా తాను ఎందుకు ఏడుస్తున్ననో అనసూయ చెప్పలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురించే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు అర్థమవుతోంది.
Also Read: New LTC Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. ఈ 3 రూల్స్‌లో మార్పులు
Also Read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook