IND vs IRE 2nd T20 Updates: టాస్ గెలిచిన ఐర్లాండ్.. తుది జట్లు ఇవే..!
India Vs West Indies 2nd T20 Toss and Playing 11: భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధఙంచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండా రెండు జట్లు ఆడనున్నాయి.
India Vs West Indies 2nd T20 Toss and Playing 11: ఐర్లాండ్‌తో సిరీస్ విజయానికి భారత్ రెడీ అయింది. వర్షం ఆటంకం కలిగించిన తొలి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు సత్తాచాటగా.. బ్యాటింగ్ ఆర్డర్‌కు పూర్తిగా అవకాశం రాలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో చెలరేగాలని బ్యాట్స్‌మెన్ ఎదురుచూస్తున్నారు. డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్.. మొదట బౌలింగ్‌కు మొగ్గు చూపింది. రెండు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
"ఈ రోజు మేం మొదట బౌలింగ్ చేయబోతున్నాం. మంచి పిచ్ కనిపిస్తోంది. బాగా సహకరిస్తుందని ఆశిస్తున్నాము. సాధారణంగా ఇక్కడ ఎక్కువ స్కోరింగ్ జరిగే వేదిక. మేము సేమ్ జట్టుతో ఆడుతున్నాము." అని ఐర్లాండ్ కెప్టెన్ స్టిర్లింగ్ తెలిపాడు.
"టాస్ గెలిచి ఉంటే మేం ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. ఈ రోజు వాతావరణం కొంచెం మెరుగ్గా ఉంది. మేము స్కోరు బోర్డుపై ఎక్కువ పరుగులు పెట్టాలనుకుంటున్నాము. నా ఫిట్‌నెస్ బాగుంది. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూనే ఉన్నా. అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం.." అని టీమిండియా కెప్టెన్ బుమ్రా తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్
ఐర్లాండ్: ఆండ్రూ బల్‌బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, బెంజమిన్ వైట్.
Also Read: Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook