Shikhar Dhawan recat on Removed As India Captain for Zimbabwe Series: టీ20 ప్రపంచకప్ 2022కి ముందు జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కి సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో ధావన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని రాహుల్‌ తిరిగి జట్టులోకి రావడంతో.. ధావన్‌ను కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించింది. బీసీసీఐ నిర్ణయాన్ని సీనియర్లు, ఫాన్స్ తప్పుపట్టారు. ధావన్‌ను అలానే సిరీస్‌ కొనసాగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి చివరి నిమిషంలో తనను తొలగించడంపై తాజాగా ధావన్‌ స్పందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి నిమిషంలో కెప్టెన్సీ నుంచి తొలగించడం తనను ఏమాత్రం బాధించలేదని, జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తప్పవని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ స్పష్టం చేశాడు. 'నేను చాలా అదృష్టవంతుడని ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే కెరీర్‌లో తక్కువ సమయంలోనే జట్టును నడిపించగల అవకాశం నాకు దక్కింది. కెప్టెన్సీ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు సవాళ్లతో కూడుకున్నవి. భారత యువ జట్టులో అద్భుత ఆటగాళ్లు ఉన్నారు. యువలతో నిండిన భారత్ మంచి విజయాలను సాధించింది' అని ధావన్‌ అన్నాడు. 


'భారత్ ప్రధాన జట్టులో కేఎల్ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. జింబాబ్వే పర్యటన సమయంలో రాహుల్ గాయం నుంచి కోలుకుని వచ్చినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. అతడికి ఈ సిరీస్‌తో ప్రాక్టీస్‌ అవసరం అని నేను భావించాను. ఎందుకంటే రాహుల్ ఆసియా కప్‌ 2022కి ఎంపికయ్యాడు. ఒకవేళ రోహిత్‌ శర్మ గాయపడితే.. కెప్టెన్సీ బాధ్యతను రాహుల్‌కే అప్పగిస్తారు. కాబట్టి జింబాబ్వే పర్యటన అతడికి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందనుకున్నాను. ఈ విషయంలో నేను ఏమాత్రం బాధపడలేదు. ఏం జరిగినా మన మంచికే అని నేను బలంగా నమ్ముతాను. ఆపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించి బీసీసీఐ సెలక్టర్లు నాకు అవకాశమిచ్చారు' అని గబ్బర్ చెప్పాడు. 


Also Read: Dinesh Karthik: దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!


Also Read: Shani Dev: శని సాడే సాతి నుంచి అన్ని రాశువారు ఇలా సులభంగా ఉపశమనం పొందవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook