IND vs NZ 1st T20I: టాస్ గెలిచిన భారత్.. చహల్, పృథ్వీ షాకి దక్కని చోటు! తుది జట్లు ఇవే
India have won the toss and have opted to field in 1st T20I vs NZ. మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.
IND vs NZ 1st T20I Playing XI Out: రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో చోటు ఆశించిన పృథ్వీ షాకి నిరాశే ఎదురైంది. ఇషాన్ కిషన్ మరియు శుభ్‌మాన్ గిల్‌లు భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా బెంచ్‌కె పరిమితం అయ్యాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన భారత్.. పొట్టి సిరీస్ కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయిన కివీస్.. కనీసం పొట్టి సిరీస్ అయినా గెలవాలని భావిస్తోంది.
టీమిండియాకు గాయాల బెడద ఎక్కువవుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా దూరం అయిన విషయం తెలిసిందే. నేటి నుంచి కివీస్‌తో ప్రారంభంకానున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరం అయ్యాడు.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), జాకబ్ డిఫ్య్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
Also Read: U-19 Womens T20 World Cup 2023 Final: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.