Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. బ్యాట్స్‌మెన్ దిమ్మతిరిగింది
Ind Vs Nz Highlights: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. కివీస్ విధించిన 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ అతికష్టం మీద ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి.
Ind Vs Nz Highlights: మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిన టీమిండియా వెంటనే తెరుకుంది. ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను రెండో మ్యాచ్‌లో ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి.. 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (26), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (15) జట్టును విజయ తీరాలకు చేర్చారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సూర్యకే దక్కింది. బుధవారం సిరీస్‌ను నిర్ణయించే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
రెండో టీ20లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్‌తో అందరి మనసులను గెలుచుకున్నాడు. టీమిండియాకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఓ వేసిన బంతి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 10వ ఓవర్ చేశాడు. ఈ ఓవర్ చివరి బంతికి కివీస్ ప్రమాదకర బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బాల్ ఆఫ్ స్టంప్ వెలుపల చాలా దూరంలో పడింది. కానీ వెంటనే టర్న్ తీసుకుని బెయిల్స్‌ను పడగొట్టింది. ఈ బాల్‌కు మిచెల్ కూడా ఆశ్చర్యపోయాడు. అవుట్ అయ్యాక చాలా సేపు పిచ్‌ను చూస్తూనే ఉన్నాడు. స్టేడియంలో ప్రేక్షకులు కూడా బంతి టర్న్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయారు. బీసీసీఐ ఈ వీడియోను షేర్ చేసింది.
కుల్దీప్ యాదవ్ టీ20 క్రికెట్‌లో సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ చైనామన్ బౌలర్‌ను ఎదుర్కొవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఆడటం అంత సులభం కాదు. కొన్ని బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేయగల సత్తా కుల్దీప్‌కు ఉంది. ఎలాంటి బ్యాటింగ్ అటాక్‌నైనా ధ్వంసం చేయగల సత్తా అతడి సొంత. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లు ఒంటి చెత్తో విజయాన్ని అందించాడు. ఇప్పటివరకు 8 టెస్టు మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 78 వన్డేల్లో 130 వికెట్లు, 27 టీ20ల్లో 46 వికెట్లు తీశాడు.
Also Read: India Post Office Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత.. డైరెక్ట్ జాబ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి