Shubman Gill: హెన్రీ నికోల్స్ భారీ షాట్.. శుభ్‌మాన్ గిల్‌కు గాయం! ఓపెనర్‌గా చేతేశ్వర్ పుజారా (వీడియో)
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ గాయపడ్డాడు. కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ కొట్టిన స్వీప్ షాట్.. గిల్ ముంజేయికి తగిలింది. దాంతో అతడు మైదానంలోనే నొప్పితో విలవిలలాడాడు.
Shubman Gill injured by Henry Nicholls sweep shot: టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) గాయపడ్డాడు. కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ (Henry Nicholls) కొట్టిన స్వీప్ షాట్.. గిల్ ముంజేయికి తగిలింది. దాంతో అతడు మైదానంలోనే నొప్పితో విలవిలలాడాడు. టీమిండియా ఫిజియో వచ్చి చికిత్స చేసినా లాభం లేకపోయింది. నొప్పి ఎక్కువగా ఉండడంతో గిల్ మైదానాన్ని వీడాడు. కొద్దిసేపటికి గిల్ ఫీల్డింగ్ కోసం వచ్చినా.. నొప్పి కారణంగా మరోసారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళిపోయాడు. విషయంలోకి వెళితే...
రెండో టెస్ట్ రెండో రోజు భారత్ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన అనంతరం న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్ ఆరంభించింది. మొహ్మద్ సిరాజ్ (Siraj) దెబ్బకు కివీస్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్ (Henry Nicholls) ఆచితూచి ఆడాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. అక్షర్ వేసిన నాలుగో బంతిని నికోల్స్ లెగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మోచేతికి బంతి బలంగా తాకింది. వెంటనే నొప్పితో విలవిలలాడాడు. ఆపై ఎల్బో పాడ్ తీసేసి చూడగా.. అక్కడ ఎర్రగా మారింది.
Also Read: Pawan Kalyan: అభిమానులకు గుడ్ న్యూస్.. భీమ్లా నాయక్ కోసం పాట పాడిన పవన్! విడుదల ఎప్పుడంటే!!
నొప్పిని భరించలేక శుభ్‌మాన్ గిల్ (GIll) తన ఎడమ చేతితో కుడి ముంజేయిని రాసుకున్నాడు. ఇంతలో టీమిండియా ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గిల్ మైదానాన్ని వీడాడు. కాసేపటికి గిల్ ఫీల్డింగ్ కోసం వచ్చినా.. నొప్పి కారణంగా మరోసారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళిపోయాడు. ఇక కివీస్ ఆలౌట్ అనంతరం గిల్ ఓపెనింగ్ కోసం రాలేదు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి చేతేశ్వర్ పుజారా (Pujara) ఓపెనర్‌గా వచ్చాడు. ఈ రోజు నొప్పి తగ్గితే.. మూడో రోజు గిల్ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా బౌలర్ల ధాటికి రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ (4/8), మహమ్మద్ సిరాజ్ (3/19) దెబ్బకు కివీస్ కుదేలైంది. కివీస్ ఆటగాళ్లలో కైల్ జేమీసన్ (17) చేసిన స్కోరే అత్యధికం కావడం గమనార్హం. టామ్ లాథమ్ (10), విల్ యంగ్ (4), రాస్ టేలర్ (1), హెన్రీ నికోల్స్ (7), టామ్ బ్లండెల్ (8), రచిన్ రవీంద్ర (4) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది.
Also Read: Health benifits of Cinnamon: దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook