India vs New Zealand 3rd ODI Playing 11 Out: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టార్ ప్లేయర్స్ మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ నామమాత్రమైన ఈ వన్డేకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఉమ్రాన్‌ మాలిక్, యుజ్వేంద్ర చహల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కివీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకొన్న భారత్.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. మూడో వన్డేలో గెలిచి ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌కు చేరాలని రోహిత్ సేన చూస్తోంది. మరోవైపు క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని కివీస్‌ చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇండోర్‌ మైదానం బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం. కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది.



తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, ఉమ్రాన్‌ మాలిక్. 
న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్, డేవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్‌ లాథమ్ (కెప్టెన్, వికెట్‌ కీపర్), గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్‌ శాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నెర్. 


Also Read: Yamaha RX100 Launch: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. యమహా ఆర్ఎక్స్ 100 మళ్లీ లాంచ్ అవుతోంది! 150cc ఇంజిన్


Also Read: Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.