Suryakumar Yadav Century, Deepak Hooda 4 wickets help India beat New Zealand in 2nd T20I: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనుయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా 65 రన్స్ తేడాతో గెలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61; 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్ దీపక్ హుడా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఈ విజయంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దీసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడింది. పరుగులేమీ చేయకుండానే ఓపెనర్ ఫిన్‌ అలెన్‌ వికెట్‌ కోల్పోయింది.ఈ సమయంలో కేన్ విలియమ్సన్‌తో కలిసి డెవాన్ కాన్వే కొద్దిసేపు ధాటిగా ఆడారు. వేగంగా ఆడే క్రమంలో వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో కాన్వే (25) ఔట్ అయ్యాడు. ఆపై కివిస్‌ బ్యాటర్లను భారత్‌ బౌలర్లు కుదురుకోనీయలేదు. క్రమంగా వికెట్లు తీస్తూ దెబ్బమీద దెబ్బ కొట్టారు. ఓవైపు వికెట్స్ పడుతున్నా కేన్ మామ ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్స్‌ విఫలమవడంతో కివిస్‌ 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు. 



ఈ మ్యాచులో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులు) సెంచరీ చేశాడు. తొలుత అర్ధ శతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను దాటేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (36) రాణించాడు. చివరి ఓవర్‌లో టీమ్ సౌథీ కేవలం ఐదు పరుగులే ఇవ్వడంతో భారత్ 200 స్కోర్ చేయలేకపోయింది. కివిస్‌ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్‌ రెండు, సోథి ఒక వికెట్‌ తీశారు.


Also Read: Tejasswi Prakash Pics: తేజస్వి ప్రకాష్ హాట్ ట్రీట్.. బిగ్‌బాస్‌ బ్యూటీ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!  


Also Read: Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.