Suryakumar Yadav: కోహ్లీతో బ్యాటింగ్ చేయడం పెద్ద సమస్య.. మీడియాతో సూర్యకుమార్ ఏం చెప్పాడంటే?
Suryakumar Yadav make sensational comments on Virat Kohli fitness. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. విరాట్ ఫిట్‌నెస్‌పై సూర్యకుమార్ ప్రశంసలు కురిపించాడు.
Suryakumar Yadav says I have a batting problem with Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో హాఫ్ సెంచరీలతో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సూర్యకుమార్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో (111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులు) చెలరేగాడు. తొలుత అర్ధ శతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత 17 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో అతడు బ్యాటింగ్ చేశాడు.
సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి సూర్య మాట్లాడాడు. విరాట్ ఫిట్‌నెస్‌పై సూర్యకుమార్ ప్రశంసలు కురిపించాడు. క్రీజ్‌లో కోహ్లీతో పరుగెత్తడం చాలా కష్టమని చెప్పాడు. 'ఇటీవల నేను, విరాట్ కోహ్లీ కలిసి కొన్ని మ్యాచ్‌లు ఆడాము. మా ఇద్దరికీ మంచి రాపో ఏర్పడింది. ఇద్దరం కలిసి కొన్ని మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం.నేను చాలా ఎంజాయ్ చేశాను' అని సూర్యకుమార్ చెప్పాడు.
'విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టమే అయినా.. ఓ సమస్య ఉంది. కోహ్లీ చాలా ఫిట్‌గా ఉంటాడు కాబట్టి వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతాడు. చిరుత వేగం మాదిరి రన్స్ తీస్తాడు. అయినా కూడా అలసిపోడు. విరాట్‌తో క్రీజ్‌లో పరుగెత్తడం చాలా చాలా కష్టం. ఇటీవలి రోజుల్లో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కోహ్లీతో సమానంగా పరుగెత్తేందుకు ప్రయత్నిస్తా' అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ జట్టుకు ఫిట్‌నెస్‌ను పరిచయం చేసింది కోహ్లీనే అన్న విషయం తెలిసిందే. విరాట్ ఎందరో యువకులకు రోల్ మోడల్ అయ్యాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. బే-ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. దీపక్ హుడా నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మూడో టీ20 మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం జరగనుంది. ఈ మ్యాచులో భారత్ గెలిస్తే సిరీస్ 2-0తో సొంతమవుతుంది.
Also Read: 141 బంతుల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ, కుమార సంగక్కర రికార్డు బ్రేక్! కొట్టింది మనోడే
Also Read: Surgery forr Abbas: అబ్బాస్ కాలికి గాయం.. సర్జరీ చేసిన వైద్యులు.. ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook