Virat Kohli sends birthday wishes to his fan after 2nd Test match: భారతదేశంలో క్రికెట్ (Cricket) ఫీవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనదగ్గర క్రికెట్‌కు ఉన్న పాపులారిటీ మరే క్రీడకు లేదన్నది అక్షర సత్యం. భారతదేశంలో క్రికెట్ ఆటను ఓ మతంలా భావిస్తారు. ఇక క్రికెటర్లను దేవుళ్లుగా భావిస్తారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండ్యూలర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్, ఎంఎస్ ధోనీలను చాలా మంది ఫాన్స్ (Fans) అభిమానిస్తారు. ఇటీవలి కాలంలో తన అభిమాన క్రికెటర్‌ను కలిసేందుకు బారికేడ్స్ దాటినా ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ధోనీ (MS Dhoni) పాదాలను తాకేందుకు ఎందరో మైదానంలోకి దూసుకెళ్లారు. అలా తమ అభిమాన ఆటగాడిని కలుసుకుని ఆనందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని కలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. బారికేడ్స్ దాటినా అభిమానిని ఏమనొద్దని అధికారులకు చెప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. మైదానంలో ఉన్నపుడు కూడా విరాట్ అభిమానులను పలకరిస్తుంటాడు. హయ్ చెప్పడం, షేక్ హాండ్స్ ఇవ్వడం కూడా చేశాడు. న్యూజీలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో కూడా అభిమానులను కోహ్లీ తనదైన శైలిలో పలకరించాడు. తాజాగా ఓ అభిమానికి బర్త్ డే విషెష్ (Birthday Wishes) చెప్పి ఆనందపరిచాడు.


Also Read: Horoscope Today 7 December 2021: నేటి రాశి ఫలాలు.. ఆ సమయంలో యమగండం...


రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ జట్టు బస్సులో వెళ్లేందుకు హోటల్ (Hotel) నుంచి కిందకు వస్తున్నాడు. స్టెప్స్ దిగుతుండగా కోహ్లీ అభిమాని ఒకరు ప్లకార్డు పట్టుకుని నిలుచున్నాడు. 'ఈరోజు నా పుట్టిన రోజు' అని అందులో రాశాడు. 'ఆల్ ది బెస్ట్ విరాట్' అని అభిమాని చెప్ప్పగా.. కోహ్లీ థాంక్స్ అని బదులిచ్చాడు. వెంటనే ఈరోజు నా బర్త్ డే (Birthday) అని అభిమాని అనగా.. 'పుట్టినరోజు శుభాకాంక్షలు' అని కోహ్లీ చెప్పాడు. దాంతో అభిమాని ఆనందంలో మునిగిపోయాడు. ఆపై కోహ్లీ టీం బస్సు ఎక్కి హోటల్ నుంచి వెళిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. కోహ్లీ మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు. 



Also Read: Kamal Haasan Health: కమల్ హాసన్ పై తమిళనాడు ఆరోగ్య శాఖ సీరియస్.. త్వరలోనే నోటీసులు జారీ!


సోమవారం న్యూజీలాండ్‌ను రెండో టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో టీమిండియా (Team India) ఓడించింది. దీంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో 50 మ్యాచ్‌లు గెలిచిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కొహ్లీ టెస్టులలో 50, వన్డేలలో 153, టీ20 ఫార్మాటలో 59 విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ టెస్టు మ్యాచ్‌లలో అందరి కంటే ఎక్కువగా 108 మ్యాచ్‌లు, వన్డేలలో 262 మ్యాచ్‌లు గెలవగా.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం 7 విజయాలనే అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్టులలో 36 విజయాలు అందుకోగా.. వన్డేలలో 205, టీ20లలో 57 మ్యాచ్‌లు గెలిచాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook