IND vs PAK, Virat Kohli Wearing High Altitude Mask Ahead of Pakistan Match: యూఏఈ వేదికగా ఆసియా కప్‌ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ దూసుకుపోతోంది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన రెండు మ్యాచులో విజయం సాధించి సూపర్‌ 4లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఇదివరకే దాయాది దేశాలు భారత్‌, పాకిస్తాన్ తలపడగా.. ఆదివారం (సెప్టెంబర్ 4) సూపర్‌ 4లో మరోసారి ఢీ కొట్టనున్నాయి. కొంతకాలంగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడం ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తిని పెంచింది. ఈ మెగా మ్యాచ్ కోసం మరోసారి క్రికెట్ ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే పాకిస్తాన్‌పై ఆధిపత్యం కొనసాగించాలని భారత్.. ప్రతీకారం తీర్చుకొవాలి పాక్ చూస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్ కాబట్టి టీమిండియా ఆటగాళ్లు అందరూ మైదానంలో శ్రమిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మైదానంలో మాస్క్‌తో కనిపించాడు. అందులోనూ హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో కనిపించడం విశేషం. ఈ మాస్క్‌తోనే విరాట్ ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్ చేశాడు. టైమ్ పెట్టుకుని మరీ సాధన చేశాడు. అంతేకాదు రన్నింగ్ కూడా చేశాడు. అయితే సాధారణంగా ఇలాంటి హై ఆల్టిట్యూడ్ మాస్క్‌ను క్రికెటర్లు వాడరు. ఇలాంటి మాస్క్‌ను గతంలో ఎవరు పెట్టుకున్న దాఖలు కూడా లేవు. 



అథ్లెట్లు మాత్రమే హై ఆల్టిట్యూడ్ మాస్క్‌ను వాడుతారు. రన్నర్లు తమ ఊపిరితిత్తులు, శ్వాస కండరాలను బలోపేతం చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ.. హై ఆల్టిట్యూడ్ మాస్క్‌ను వాడాడు. మరింత ఫిట్‌నెస్ కోసమే ఈ మాస్క్‌ను విరాట్ వాడాల్సి వచ్చింది. ఈ టోర్నీలో విరాట్ సత్తా చాటుతున్నాడు. పాకిస్తాన్‌పై 35, హాంకాంగ్‌పై 59 రన్స్ చేశాడు. ఫామ్ అందుకున్న కోహ్లీ.. పాకిస్తాన్‌ మ్యాచ్‌లో కూడా చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 


Also Read: IND vs PAK: భారత్‌ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన పాకిస్తాన్‌.. టాప్‌లో శ్రీలంక!


Also Read: Divi Vadthya Hot Photos: ప్రైవేట్ పార్ట్ టాటూ బయటపెట్టిన దివి..పొట్టి బట్టల్లో హాట్ ట్రీట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook