India Vs Pakistan Predicted Playing 11: ప్రస్తుతం ప్రపంచం అంతా వన్డే వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు ఓ లెక్క.. రేపు జరగబోయే మ్యాచ్ మరో లెక్క. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు శనివారం జరగబోతుంది. ఈ వోల్టేజ్ మ్యాచ్‌కు టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియ వేదికగా దయాదుల మధ్య సమరం జరగనుంది. ఇటీవల ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు తలపడగా.. టీమిండియా విజయం సాధించింది. ప్రపంచకప్‌లో కూడా పాక్‌ను ఓడించి.. విశ్వకప్‌లో ముందడుగు వేయాలని భావిస్తోంది. అటు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ చూస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఎలాంటి మార్పులు చేస్తాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా విషయానికి వస్తే.. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోగ్యంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరమయ్యారు. ఢిల్లీకి జట్టుతోపాటు వెళ్లని గిల్.. చెన్నై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి అహ్మదాబాద్‌కు వచ్చాడు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో గిల్ ఉంటాడా..? లేదా..? అనేది మ్యాచ్‌ సమయంలో తేలనుంది. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న గిల్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గిల్ కోసం ప్రత్యేకంగా బ్యాటింగ్ సెషన్‌ కూడా ఏర్పాటు చేశారు. గురువారం దాదాపు గంటపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. 


గిల్ జట్టులోకి వస్తే.. ఇషాన్ కిషన్ బెంచ్‌పై కూర్చొవాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్ సూపర్‌ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాకు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. మ్యాచ్ పరిస్థితులను బట్టి.. శార్దూల్ ఠాకూర్ లేదా రవిచంద్రన్ అశ్విన్‌లో ఒకరిని ప్లేయింగ్ 11లో తీసుకునే ఛాన్స్ ఉంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండడం ఖాయం. 


వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ టాప్ ఆర్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ విఫలమయ్యారు. దీంతో శ్రీలంక మ్యాచ్‌లో ఫఖర్‌ను తొలగించి.. అబ్దుల్లా షఫీక్‌ను జట్టులోకి తీసుకున్నారు. షఫీక్ సెంచరీ బాది జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడు తుది జట్టులో గ్యారంటీగా ఉంటాడు. అయితే ఇమామ్ స్థానంలో ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. భారత్‌పై ఫఖర్‌కు మెరుగైన రికార్డు ఉంది.  బాబర్ అజామ్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్‌ స్థానంలో మహ్మద్ వాసిమ్ జూనియర్ లేదా లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్‌ని ప్లేయింగ్ 11లో చేర్చేందుకు యోచిస్తోంది. 


Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  


Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి