India vs Pakistan Score Updates: పాకిస్థాన్‌లో జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆశించినస్థాయిలో రాణించలేకపోయారు. 48.5 ఓవర్లలో 266 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఒక దశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా.. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్థిక్ పాండ్యా (90 బంతుల్లో 87, 7 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి జోరుతో టీమిండియా 300 మార్కు కూడా దాటుతుందని అనిపించింది. అయితే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి 266 రన్స్‌కు పరిమితమైంది. పాక్ పేసర్ షాహీన్‌ ఆఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. నసీమ్ షా, హరీస్ రౌఫ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. వికెట్లన్నీ పేసర్లకే దక్కాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి నాలుగు ఓవర్లు రోహిత్, గిల్ జోడీ జాగ్రత్తగా ఆడింది. స్కోరు 15 పరుగులు ఉండగా.. వర్షం కారణంగా దాదాపు 20 నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు. అనంతరం మ్యాచ్ ప్రారంభం తరువాత పాక్ పేసర్లు చెలరేగారు. పేసర్ షాహీన్ ఆఫ్రిది రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (11)లను క్లీన్‌బౌల్డ్ చేసి దెబ్బ తీశాడు. చాలా రోజుల తరువాత మ్యాచ్‌ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ (14) రెండు బౌండరీలతో దూకుడు ప్రదర్శించినా.. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్ (10) చాలాసేపు క్రీజ్‌లో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.


66 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో ఇషాన్-పాండ్యా జోడి జట్టును ఆదుకుంది. ఓవైపు వికెట్లు కాపాడుకుంటునే.. మరోవైపు రన్‌రేట్ తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇషాన్ వన్డేల్లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా కూడా దూకుడుగా ఆడుతూ అర్ధసెంచరీ బాదాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 


ఇషాన్ కిషన్ ఔట్ అయిన తరువాత మరింత దూకుడు పెంచాడు పాండ్యా. రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. అయితే 87 పరుగులు చేసిన పాండ్యాను షాహీన్ ఆఫ్రిది ఔట్ చేసి మళ్లీ భారత్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా 14 పరుగుల వద్ద అవుటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ (3) కూడా విఫలమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా (16) జట్టు స్కోరును 250 దాటించాడు. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 267 పరుగుల లక్ష్యంతో పాక్ బరిలోకి దిగనుంది.


Also Read: Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన  


Also Read: Mission Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook