ICC Women's T20 World Cup 2023 Live; మరికొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్‌ పోరు ప్రారంభంకానుంది.  కేప్‌టౌన్‌ వేదికగా తొలి మ్యాచ్ లో భారత మహిళల జట్టు..పాకిస్థాన్ వుమెన్స్ టీంతో తలపడనుంది. ఆదివారం గ్రూప్‌- బి పోరులో భాగంగా ఈ మ్యాచ్ జరగునుంది. దాయాదితో పోరు అంటే అభిమానుల్లో మామూలు జోష్ ఉండదు. ఈ మ్యాచ్ లో భారత్‌ ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. వేలి గాయం వల్ల స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఈ  మ్యాచ్‌కు దూరమైంది. ఇది భారత్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్-పాక్ లు ఎమిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఆరుసార్లు విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జట్టు కూర్పు విషయానికొస్తే.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌, జెమీమాలతో కూడిన బ్యాటింగ్ ద్వయం మరోసారి కీలకం కానుంది. హర్మన్‌ గాయం నుంచి కోలుకుని మ్యాచ్ కు సిద్దమైంది. కెప్టెన్ గా అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన షెఫాలి వర్మ.. ఓపెనర్‌గా సత్తాచాటాల్సి ఉంది. బౌలింగ్ విభాగానికొస్తే.. పేసర్ రేణుక మాత్రమే ఫామ్ లో ఉంది. సీనియర్ పేసర్ శిఖా పాండేతో ఏపీ అమ్మాయి అంజలి శర్వాణి, పుజా వస్త్రాకర్‌ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. టీ20ల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పది మ్యాచ్ ల్లో నెగ్గింది. ఈరోజు జరగబోయే మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. 


Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి