IND vs PAK Memes: పాకిస్థాన్‌పై భారత్ సూపర్ విక్టరీ.. వైరల్ అవుతోన్న మీమ్స్! అచ్చు చరణ్-ఎన్టీఆర్‌లా హార్దిక్-జడేజా
IND vs PAK, Hilarious memes on Hardik Pandya and Ravindra Jadeja. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ వైరల్‌గా మారాయి.
IND vs PAK, Hilarious memes goes viral on Hardik Pandya and Ravindra Jadeja: ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్ వరకు ఉత్కంటంగా సాగిన మ్యాచులో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.
ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు కావల్సిన సమయంలో.. మొహ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికే మంచి ఊపులో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే క్రీజులో హార్ధిక్ పాండ్యా ఉండడం, ఫినిషర్ దినేష్ కార్తీక్ రాకతో భారత అభిమానులు విజయంపై నమ్మకంగా ఉన్నారు. డీకే రెండో బంతికి సింగిల్ తీయగా.. హార్దిక్ మూడో బంతిని డాట్ చేశాడు. దాంతో కార్తిక్ సింగిల్ కోసం రమ్మని పిలిచినా.. 'నేను చూసుకుంటా.. వదిలేయ్' అన్నట్లు హార్దిక్ ఓ సైగ చేశాడు. నాలుగో బంతికి పవర్‌ఫుల్ షాట్ ఆడి సిక్సుతో టీమిండియాకు విజయాన్ని అందించాడు.
హార్ధిక్ పాండ్యా సిక్స్ బాధగానే టీమిండియా ఆటగాళ్లతో పాటుగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్రెసింగ్ రూంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యను నాన్ స్ట్రైకింగ్‌లోని దినేశ్ కార్తిక్ 'టేక్ ఏ బౌ' అంటూ అభినందించాడు. పాకిస్తాన్‌పై విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ వైరల్‌గా మారాయి. కొందరు పాక్ ఆటగాళ్లను ఆడేసుకుంటుంన్నారు. మరికొందరు హార్దిక్-జడేజాలను ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని చరణ్-ఎన్టీఆర్‌లా మార్ఫింగ్ చేశారు. ఈ మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
Also Read: జడేజా నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా.. మంజ్రేకర్ ప్రశ్నకు జడ్డూ రియాక్షన్ ఏంటంటే?
Also Read: Rohit Sharma Record: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి