Ind Vs Pak Saff Championship 2023: మ్యాచ్ మధ్యలో భారత్-పాక్ ఆటగాళ్ల వాగ్వాదం.. స్పాట్లో అంపైర్ యాక్షన్..!
Indian Football Fixtures 2023: భారత్-పాక్ మ్యాచ్ అంటే.. వేదిక అయినా అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గదు. తాజాగా శాఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 4-0 తేడాతో భారత్ ఓడించింది. పూర్తి వివరాలు ఇలా..
Indian Football Fixtures 2023: ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే.. అది ఏ క్రీడ అయినా పోరు హోరాహోరీగా ఉంటుంది. శాఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో బుధవారం భారత్-పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. భారీ హైవోల్టేజీ డ్రామా మధ్య నడిచిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్ సాధించడంతో 4-0 తేడాతో పాక్ జట్టును భారత్ చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత్.. ఎక్కడా కూడా పాకిస్థాన్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ గెలిచిన టీమిండియా.. అదేఊపులో పాక్‌ను మట్టికరిపించింది.
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్ టైమ్‌కు ముందే భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా వరుసగా గోల్స్ చేయడంతో పాక్ ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇంతలో ఓ పాకిస్థానీ ఆటగాడు భారత కోచ్‌తో గొడకు దిగాడు.
పాక్ ఆటగాడు బంతి విసురుతుండగా.. కోర్టు బయట నిలబడి ఉన్న భారత కోచ్ స్టిమాక్ బంతిని చేతితో పక్కకు తోశాడు. దీంతో పాక్ ఆటగాటు ఏదో చెప్పడానికి ప్రయ్నతించాడు. ఈలోపు ఇతర పాక్ ఆటగాళ్లు వచ్చి స్టిమాక్‌తో వాదనకు దిగారు. భారత ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకుని కోచ్‌కు మద్దతుగా నిలిచారు. కొంత సమయం తరువాత వివాదం సద్దుమణిగింది.
టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్‌తో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్నెషనల్ మ్యాచ్‌లతో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఛెత్రీ ఇప్పటివరకు మొత్తం 90 గోల్స్ చేశాడు. ఇరాన్‌కు చెందిన అల్ డీ 109 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ వివాదం జరిగిన వెంటనే.. మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. భారత కోచ్ స్టిమాక్‌కు రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి పంపించేశారు. దీంతో పాటు పాక్ కోచ్ షాజాద్ అన్వర్‌కు ఎల్లో కార్డు చూపించి.. లాస్ట్ హెచ్చరిక చెప్పారు.
Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం
Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి