Virat Kohli set to complete 100 T20I match against Pakistan: ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆగస్టు 28న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. దుబాయ్‌లోని షేక్‌ జాయెద్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్‌తో మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. దాంతో అంతర్జాతీయ టీ20లలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా కోహ్లీ చరిత్రలో నిలువనున్నాడు. ఈ ఫీట్‌ను న్యూజిలాండ్‌ ప్లేయర్ రాస్‌ టేలర్‌ మాత్రమే అందుకున్నాడు. టేలర్‌ 102 టీ20లు ఆడాడు. కోహ్లీ ఆసియా కప్‌ 2022 ద్వారా టేలర్‌ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. విరాట్‌ ఇప్పటివరకూ 99 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 


విరాట్ కోహ్లీ మరో ఏడు సిక్సులు కొడితే.. టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తర్వాత 100 సిక్సులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఆసియా కప్‌ 2022 ఫైనల్ వెళితే కోహ్లీ ఈ రికార్డు పక్కగా అందుకోనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్‌లో మరో 374 పరుగులు చేస్తే 11 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ చరిత్రలో నిలిచిపోతాడు. ఇటీవల విశ్రాంతి తీసుకున్న కోహ్లీ..  ఆసియా కప్‌ 2022లో బరిలోకి దిగనున్నాడు. కోహ్లీపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. 


Also Read: IND Playing 11 vs Pak: దినేష్ కార్తీక్ వద్దు.. పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌కు సునీల్ గవాస్కర్ జట్టు ఇదే!


Also Read: కోబ్రా ట్రైలర్‌ వచ్చేసింది.. 'అపరిచితుడి'ని మించిపోయిందిగా! తళుక్కుమన్న క్రికెటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook