Cobra Trailer: కోబ్రా ట్రైలర్‌ వచ్చేసింది.. 'అపరిచితుడి'ని మించిపోయిందిగా! తళుక్కుమన్న భారత క్రికెటర్

Chiyaan Vikram's Cobra Movie Official Trailer released. విక్రమ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న 'కోబ్రా' సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదల అయింది. ఈ ట్రైలర్‌ 'అపరిచితుడి'ని మించిపోయిందిగా.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 26, 2022, 07:14 PM IST
  • కోబ్రా ట్రైలర్‌ వచ్చేసింది
  • 'అపరిచితుడి'ని మించిపోయిందిగా
  • తళుక్కుమన్న భారత క్రికెటర్
Cobra Trailer: కోబ్రా ట్రైలర్‌ వచ్చేసింది.. 'అపరిచితుడి'ని మించిపోయిందిగా! తళుక్కుమన్న భారత క్రికెటర్

Chiyaan Vikram's Cobra Movie Official Trailer released: కోలివుడ్ స్టార్ హీరో 'చియాన్‌' విక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయోగాలకు పెట్టింది పేరు విక్రమ్‌. చిత్ర విచిత్రమైన గెటప్పులు చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది విక్రమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో తన పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాడు. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, మల్లన్న, ఐ, ఇంకొక్కడు సినిమాలలో విక్రమ్‌ చేసిన గెటప్పులు ఎలాంటివో మనకు తెలిసిందే. తాజాగా అంతకు మించి అనేలా మరో సినిమా చేస్తున్నాడు. 

అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'కోబ్రా'. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. డైరెక్టర్ కెఎస్‌ రవికుమార్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన విక్రమ్‌.. గణిత శాస్త్రవేత్తగా నటించారు. ఆగష్టు 31 కోబ్రా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా.. శుక్రవారం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

2 నిమిషాల 33 సెకండ్ల నిడివి గల కోబ్రా ట్రైలర్‌.. కథానాయకుడు విక్రమ్‌ను హింసించే సన్నివేశంతో ప్రారంభమైంది. నువ్వేనా మాథ్స్ టీచర్‌వి అంటూ విక్రమ్‌ని తాడుకు వేలాడ దీసి విలన్ కొడుతాడు. 'అతడు ఆప్ కోబ్రా.. రకరకాలుగా రూపం మార్చుకుని వెళ్లడం తెలుసు, చాటుగా మాటేసి కాటేయడం తెలుసు' 'నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా నాకు తెలుసు' 'సర్ నేను ఓ సాధరణ మాథ్స్ టీచర్ సర్' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

అపరిచితుడు చిత్రంలో మూడు విభిన్న పాత్రలతో నటించి మెప్పించిన విక్రమ్‌.. కోబ్రా సినిమాలో ఏకంగా ఏడు గెటప్పుల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో కోలివుడ్ స్టార్ హీరో విక్రమ్‌ మరోసారి తన నట విశ్వరూపం చూపించనున్నాడు. ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విక్రమ్‌ గెటప్పులను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కోబ్రా ట్రైలర్‌లో తళుక్కుమన్నారు. 

Also Read: దినేష్ కార్తీక్ వద్దు.. పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌కు సునీల్ గవాస్కర్ జట్టు ఇదే!

Also Read: Pranita Subhash Hot Photos: తల్లయ్యాక పొట్టి బట్టలలో దర్శనం ఇచ్చిన ప్రణీత.. ఫోటోలు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News