T20 World Cup 2022 IND vs PAK Melbourne Weather Live Updates: ప్రపంచ క్రికెట్‌లోనే అసలు సిసలు సమరంకు సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా నేటి మధ్యాహ్నం దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ ఢీ కొట్టనుంది. పేస్‌కు స్వర్గధామమైన మెల్‌బోర్న్‌ మైదానంలో లక్షమంది ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్న ఈ మెగా మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడి.. నాకౌట్‌ దశకు చేరకుండానే వెనుదిరిగిన భారత్.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు  ప్రపంచకప్‌లో మరోసారి ఆధిపత్యం కొనసాగించాలని పాక్ భావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెల్‌బోర్న్‌లో జరిగే భారత్, పాకిస్థాన్ పోరుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో.. సోషల్ మీడియాలో వాతావరణ పరిస్థితులు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ఆందోళన సగటు క్రికెట్ అభిమానుల్లో ఉంది. ముఖ్యంగా ఇండో, పాక్ ఫాన్స్. అయితే మెల్‌బోర్న్ నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం.. ప్రస్తుతం ఆకాశం మొత్తం మేఘావృతం అయి ఉందట. అయితే 3 లేదా 4 రోజుల ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. నేటి పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయట. నేడు వర్షం పడే అవకాశాలు తగ్గాయట. 


ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ జారీ చేసిన వాతావరణ సూచన ప్రకారం.. ఆదివారం మెల్‌బోర్న్‌లో 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. సాయంత్రం వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. దాంతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆకాశం మబ్బులు పట్టి ఉన్నా.. వర్షం పడే అవకాశం తక్కువ. మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. 



మెల్‌బోర్న్‌ మైదానంలో ప్రపంచ స్థాయి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది. దాంతో వర్షం పడినా త్వరగానే మైదాన్ని సిద్ధం చేయనున్నారు. ఇక  భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే ఫాన్స్ మైదానం వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మెల్‌బోర్న్‌లో మేఘావృతమైన ఆకాశాన్ని చూపించే ఫొటోస్, వీడియోలను ఫాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మ్యాచ్ జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 



Also Read: IND vs PAK Dream11 Team: భారత్ vs పాకిస్థాన్‌ పోరు.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!


Also Read: Mega 154 Title Teaser : కేకపుట్టించేలా చిరు స్టైల్.. పూనకాలు లోడింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook