IND vs PAK Dream11 Team: భారత్ vs పాకిస్థాన్‌ పోరు.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!

T20 World Cup 2022 India vs Pakistan Dream11 Team.  టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మరో కొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 23, 2022, 11:25 AM IST
  • మధ్యాహ్నం 1.30కు భారత్ vs పాకిస్థాన్‌ పోరు
  • డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే
  • పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని
IND vs PAK Dream11 Team: భారత్ vs పాకిస్థాన్‌ పోరు.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!

T20 World Cup 2022 India vs Pakistan Dream11 Team: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మరో కొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్‌బోర్న్‌ వేదికగా మ్యాచ్ జరగనుంది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో పాక్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. ఆసియా కప్‌ 2022లోనూ చెరొక విజయం సాధించాయి. దీంతో గత ప్రపంచకప్‌ ఓటమికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరిద్దరూ 2021 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై పేలవ ప్రదర్శన మరిచేలా సూపర్‌ ఇన్నింగ్స్ ఉండాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్‌ చూస్తే టీమిండియాకు మంచి ఆరంభం దక్కనుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు రెడీగా ఉన్నాడు. మిడిలార్డర్‌లో మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్ ఆదుకునేందుకు సిద్ధం. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఫినిషర్‌ దినేశ్ కార్తిక్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు. ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ ఆడనున్నాడు. 

కీలక పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సీనియర్‌ ఆటగాడు మహమ్మద్‌ షమీ తీర్చనున్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్‌ వేసినప్పటికీ.. మూడు వికెట్లను పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్ సత్తాచాటేందుకు సిద్ధం.  సీనియర్‌ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్ ఎలాగూ ఉన్నాడు. ఆపద్బాంధవుడు పాత్రను పోషించేందుకు హార్దిక్‌ పాండ్యా ఉన్నాడు. స్పిన్నర్లు  యుజ్వేంద్ర చహల్‌, ఆర్ అశ్విన్‌లు ఉన్నారు. 

డ్రీమ్ ఎలెవన్ టీమ్:
మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), బాబర్ ఆజం, హైదర్ అలీ, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, షాదాబ్ ఖాన్, (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్. 

Also Read: Vijayawada: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం..

Also Read: NBK 107 Vs Chiru 154 : చిరుకి దరిదాపుల్లోకి రాలేని బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News