IND vs PAK: బిస్మా మరుఫ్ హాఫ్ సెంచరీ.. భారత్ లక్ష్యం 150!
Pakistan set 150 target to India in Womens T20 World Cup 2023. మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ పోరాడే స్కోర్ చేసింది.
Bismah Maroof Half Century Help Pakistan Women set 150 target to India Women: మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. దాంతో భారత్ ముందు 150 పరుగుల లక్ష్యం ఉంది. పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ (68 నాటౌట్; 55 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసింది. మరో బ్యాటర్ అయేషా నసీమ్ (43 నాటౌట్; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్స్ తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టుకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మునీబా అలీ (12), జవేరియా ఖాన్ (8) నిరాశపరిచారు. ఈ ఇద్దరిని రాధా యాదవ్, దీప్తి శర్మ వెనక్కి పంపారు. ఆపై నిదా దర్ (0), సిద్రా అమీన్ (11) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దాంతో 74కే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ బిస్మా మరూఫ్ జట్టును ఆడుకుంది.
అయేషా నసీమ్ అండతో బిస్మా మరూఫ్ పాకిస్తాన్ జట్టు స్కోరును ముందుకు నడిపింది. ఈ ఇద్దరు ఆచితూచి ఆడారు. గతి తప్పిన బంతి వస్తే బౌండరీలు తరలించారు. ముఖ్యంగా అయేషా చెత్త బంతులను అస్సలు వదలలేదు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలోనే మరూఫ్ హాఫ్ సెంచరీ బాదింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్స్ తీసింది.
Also Read: IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమి.. రంగంలోకి కొత్త స్పిన్నర్! డేవిడ్ వార్నర్‌పై వేటు
Also Read: Camphor Benefits: రూ.2 కర్పూరంతో ఇన్ని జబ్బులు నయమవుతాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.