ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో రెండు ప్రత్యర్ధి దేశాలకు తొలిమ్యాచ్. చివరి బంతివరకూ ఉత్కంఠ కల్గించిన మ్యాచ్‌ను మలుపు తిప్పిన నో బాల్‌పై ఇప్పుడు వివాదం రేగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తొలి మ్యాచ్ అలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిట్ట చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ కల్గించిన మ్యాచ్ ఇది. విరాట్ కోహ్లీ జీవితంలో మర్చిపోలేని ఇన్నింగ్స్ ఇది. టీమ్ ఇండియాకు విజయంతో మువ్వన్నెల జెండా రెపరెపలాడిన సందర్భమిది. అయినా సరే...నో బాల్ వివాదం పెరిగి పెద్దదవుతోంది.


నో బాల్ వివాదమేంటి అసలు


ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపింది. టీమ్ ఇండియాకు చివరి ఓవర్‌లో 16 పరుగులు కావాలి. చివరి ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా అవుట్ అవడంతో..ఇంకా 5 బంతుల్లో 16 పరుగుల అవసరం వచ్చింది. నాలుగవ బంతికి విరాట్ కోహ్లీ ఫైన్ లెగ్ దిశలో సిక్సర్ కొట్టాడు. అప్పుడు అంపైర్ నో బాల్ ఇవ్వలేదు. ఆ తరువాత విరాట్ కోహ్లీ నో బాల్ కోసం అంపైర్‌ను అడిగాడు. ఇద్దరు అంపైర్లు కాస్సేపు ఈ విషయంపై చర్చించుకున్న తరువాత లెగ్ అంపైర్ దీనిని నో బాల్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రతిఘటించినా అంపైర్లు పట్టించుకోలేదు. వాస్తవానికి  ఈ నో బాల్ మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. ఇండియా 4 వికెట్ల తేడాతో విజయానికి కారణమైంది. 


నో బాల్‌పై షోయబ్ అక్తర్ అసంతృప్తి


పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇప్పుడు ఈ నో బాల్‌పై అసంతృప్తి వెళ్లగక్కాడు. ట్విట్టర్ ఎక్కౌంట్లో విరాట్ సిక్సర్ కొడుతున్న పిక్ షేర్ చేసి అంపైర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇవాళ రాత్రికి అంపైర్ సోదరులకు ఇది ఫుడ్ ఫర్ థాట్ అంటూ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో అంపైరింగ్ సరిగ్గా లేదనే అంశాన్ని లేవనెత్తాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ నో ఇవ్వకుండా..విరాట్ కోహ్లీ అభ్యర్ధనపై లెగ్ అంపైర్ నో బాల్ ప్రకటించడాన్ని ప్రశ్నిస్తున్నాడు.



పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్ షోయబ్ అక్తర్ నిర్ణయంపై స్పందించాడు. పాకిస్తాన్ టీమ్ ఈ నో బాల్ నిర్ణయంపై ఆనందంగా లేకపోయినా..ఆ నిర్ణయం సరైందేనన్పిస్తోందన్నాడు. 


Also read: Ind vs Pak: నరాలు తెగే ఉత్కంఠ, చివరి ఓవర్‌లో అసలు ఏం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook