IND vs SA: 25 ఏళ్ల జవగళ్ శ్రీనాథ్ రికార్డును.. ఉమ్రాన్ మాలిక్ బ్రేక్ చేస్తాడా?
IND vs SA: Umran Malik may break Javagal Srinath fastest delivery record. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 25 ఏళ్ల రికార్డును ఉమ్రాన్ మాలిక్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.
IND vs SA 1st T20I, Umran Malik may break Javagal Srinath fastest delivery record: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉమ్రాన్ మాలిక్ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఉమ్రాన్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌లను బెంబేలెత్తించాడు. లీగ్ ఆసాంతం స్థిరంగా 150 కిమీ వేగంతో బంతులు సంధించాడు. ఓ మ్యాచులో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచులలో 'ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు' ఉమ్రాన్‌దే అంటే.. అతడి బంతులు ఎంత వేగంతో దూసుకెళుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఐపీఎల్ 2022లో 14 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడికి ఏకంగా భారత జట్టలో చోటు దక్కింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో గురువారం (జూన్ 9) నుంచి ఆరంభం అయ్యే టీ20 సిరీస్‌కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి టీ20లో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉన్న ఉమ్రాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ ఐపీఎల్ 2022లో భాగంగా మే 5న బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కిమీ వేగంతో బంతిని సంధించాడు. 22 ఏళ్ల ఉమ్రాన్.. 20వ ఓవర్ నాలుగో బంతికి ఈ ఫీట్ సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టీ20లో అదే వేగంతో బౌలింగ్ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బంతిని సంధించిన భారత బౌలర్‌గా ఉమ్రాన్ నిలుస్తాడు. 1997లో ఆస్ట్రేలియాపై గంటకు 149.6 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ సంధించాడు.
అయితే ఉమ్రాన్ మాలిక్ గురువారం జరిగే తొలి టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తాడో లేదో చూడాలి. ఉమ్రాన్‌కు అర్ష్‌దీప్ సింగ్ గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అర్ష్‌దీప్ అద్బుతమైన యార్కర్లు సంధించాడు. అర్ష్‌దీప్ యార్కర్లకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిదా అయ్యాడట. మరోవైపు రిషబ్ పంత్‌కు ఉమ్రాన్ బౌలింగ్ చేయగా.. ఒక్క బంతిని కూడా వదలకుండా బాదాడు. దాంతో ఉమ్రాన్ అరంగేట్రం సందిగ్ధంలో పడింది.
Also Read: IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ఆటగాళ్లు ఔట్! టీమిండియా కెప్టెన్‌గా పంత్
Also Read: Poonam Bajwa Bikini Pics: ఆహా అనిపిస్తున్న పూనమ్ బజ్వా అందాలు.. అందరి చూపు అక్కడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి