IND VS SA 1st T20I: ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో మాంచి ఊపుమీదున్న టీమిండియా ఇవాళ సఫారీ జట్టు పోరుకు సిద్ధమైంది. ప్రపంచకప్ కు ముందు భారత్ జట్టుకు ఇదే చివరి టీ20 సిరీస్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే మొదటి టీ20లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఎదుర్కోబోతుంది. ఈ సిరీస్ కు కీలక ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతుంది. ప్రపంచ కప్ నేపథ్యంలో వారికి రెస్ట్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సిరీస్ ను ఎలాగైనా గెలిచి మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనీ టీమిండియా భావిస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తుంది. చివరి ఓవర్లలో మన బౌలర్లు తేలిపోతున్నారు. ఈ సిరీస్ లోనైనా ఆ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి ఇంకా కోలుకోని షమీ ఈ సిరీస్ కు కూడా దూరమయ్యాడు. గత మ్యాచ్ ల్లో భారీగా పరుగుల్చిన హర్షల్ పటేల్ ఈ సిరీస్ లోనైనా గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఆసీస్ తో సిరీస్ లో అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌ సఫారీతో సిరీస్ లోనూ అదే ఫామ్‌ కొనసాగించాలని జట్టు యజమాన్యం కోరుకుంటుంది. 


బ్యాటర్ల విషయానికొస్తే.. రోహిత్, విరాట్ , సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లోనైనా ఫామ్ ను అందుపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు వెన్నునొప్పితో జట్టుకు దీపక్ హుడా దూరం కావడంతో అతడి  స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు బవుమా నేతృత్వంలో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. 


Also Read: Virat Kohli Cutout: మాములు క్రేజ్ కాదు.. త్రివేండ్రంలో విరాట్ కోహ్లీ భారీ కటౌట్! బిత్తరపోయిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook