IND vs SA 2nd ODI playing 11 Out: రాంఛీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మరికాసేపట్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టెంబా బావుమా, తబ్రైజ్ షమ్సీ ఆడడం లేదని వారి స్థానాల్లో రీజా హెండ్రిక్స్ మరియు జార్న్ ఫోర్టుయిన్ తుది జట్టులోకి వచ్చారని మహరాజ్ చెప్పాడు. మరోవైపు భారత్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ ఆడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నో వన్డే విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతోంది. రాంచీలో సిరీస్‌పై ప్రొటీస్ జట్టు గురిపెట్టింది. వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీకి అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్‌ కీలకమైన తరుణంలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు దీటుగా స్పందించే అవకాశముంది. మరోవైపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత్ ఈ మ్యాచులో గెలవాలని పట్టుదలతో ఉంది. దాంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. 



తుది జట్లు:
భారత్‌: శిఖర్ ధావన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, షహబాజ్‌ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌, అవేశ్ ఖాన్‌. 
దక్షిణాఫ్రికా: జననేమన్ మలన్, క్వింటన్ డికాక్, రీజా హెడ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్‌, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్‌ (కెప్టెన్), జార్న్ ఫోర్టైన్, కగిసో రబాడ, ఆన్రిచ్‌ నోర్జ్. 


Also Read: Hyderabad Rain : వరదలో మునిగిన హైదరాబాద్.. కేటీఆర్ ను ఏకిపారేసిన నెటిజన్లు 


Also Read: కొత్త కారుకు గొప్ప వెల్‌కమ్.. ఎంట్రీ అదిరిపోయిందిగా! వీడియో చూస్తే నవ్వుకుంటారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.