Shreyas Iyer-Ishan Kishan breaks Rahul Dravid-Sachin Tendulkar record: రాంచీ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ప్రొటీస్ నిర్ధేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 45.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టీమిండియా యువ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌ (113 నాటౌట్‌; 111 బంతుల్లో 15×4), ఇషాన్‌ కిషన్‌ (93; 84 బంతుల్లో 4×4, 7×6) సూపర్ బ్యాటింగ్‌తో భారత్ అలవోక విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక చివరి వన్డే ఢిల్లీలో మంగళవారం జరుగుతుంది.ఈ మ్యాచులో ఓ రికార్డు నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 161 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో దక్షిణాఫ్రికాపై మూడో వికెట్‌కు రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడిగా శ్రేయాస్-ఇషాన్ నిలిచారు. ఈ క్రమంలో లెజెండరీ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డును (158) బద్దలు కొట్టారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే జోడి 189 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. 


వన్డేల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌కు మూడో వికెట్‌కు టాప్ 3 భాగస్వామ్యం:
189 పరుగులు - విరాట్ కోహ్లీ/అజింక్యా రహానే
161 పరుగులు - ఇషాన్ కిషన్/శ్రేయాస్ అయ్యర్
158 పరుగులు - సచిన్ టెండూల్కర్/రాహుల్ ద్రవిడ్ 


Also Read: Gurugram: చెరువులో స్నానానికి దిగి.. ఆరుగురు చిన్నారులు మృత్యువాత


Also Read: Dhanteras Significance: దంతేరస్ నాడు ఆ వస్తువు తప్పకుండా కొనాల్సిందే, అలా చేస్తే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook