IND vs SA: లంచ్ బ్రేక్.. ఆరు వికెట్లు కోల్పోయిన రాహుల్ సేన! పీకల్లోతు కష్టాల్లో భారత్!!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై భారత్ పట్టుకోల్పోయింది. మూడో రోజు భోజనవిరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
IND vs SA 2nd Test: Rabada, Ngidi jolt Team India after Pujara-Rahane stand: మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై భారత్ (India) పట్టుకోల్పోయింది. ఆటలో మూడోరోజైన బుధవారం ప్రొటీస్ బౌలర్లు చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయిన రాహుల్ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు భోజనవిరామ సమయాని (Lunch Break)కి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్రీజ్‌లో హనుమ విహారి (6), శార్దూల్ ఠాకూర్ (4) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 161 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. కాగిసో రబాడ (Kagiso Rabada) మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్ ఆశలు అన్ని విహారి, ఠాకూర్‌పైనే ఉన్నాయి. ఇద్దరు కలిసి మరో 100 పరుగులు చేస్తేనే గెలుపై ఆశలు ఉంటాయి.
ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజైన బుధవారం ఆటను ప్రారంభించిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాటర్లు చేతేశ్వర్ పుజారా (53), అజింక్య రహానే (58) ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఇద్దరు చెత్తబంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో పుజారా (Pujara), రహానే (Rahane) అర్ధ శతకాలు నమోదు చేసుకున్నారు. వీరద్దరూ కలిసి 111 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.
Also Read: Omicron Alert: హోం ఐసోలేషన్ 7 రోజులే.. కరోనా పరీక్షలు అవసరం లేదు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే!!
అయితే స్వల్ప వ్యవధిలో చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్ (0) పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. అయితే కాస్త దూకుడుగా ఆడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (16) లంచ్ బ్రేక్‌కు ముందు పెవిలియన్‌కు చేరాడు. దాంతో భారత్ కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ సమయంలో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur), హనుమ విహారి (Hanuma Vihari) మరో వికెట్ పడనీయకుండా మొదటి సెషన్‌ను పూర్తిచేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 3.. అలివీర్, జాన్‌సెన్, ఎంగిడి తలో వికెట్ తీశారు. ఠాకూర్, విహారి ఇంకో వంద పరుగులు చేస్తేనే విజయం కోసం భారత్ పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 రన్స్ చేయగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులు చేసింది.
Also Read: Rishabh Pant Record: రిషబ్ పంత్ అరుదైన రికార్డు.. నాలుగో భారత వికెట్ కీపర్‌గా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి