New isolation guidelines released from Union Health Ministry: దేశంలో కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్ (Home Isolation)లో ఉండేవారికి కేంద్రం (Union Health Ministry) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ బుధవారం (డిసెంబర్ 5) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదివరకు పది రోజులుగా ఉన్న హోం ఐసోలేషన్‌ను 7 రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు.. పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చు. హోం ఐసోలేషన్ ముగిసిన తర్వాత మరోసారి కరోనా పరీక్షలు (Corona Test) చేయించుకోవాల్సిన అవసరంలేదు.
హోం ఐసోలేషన్‌కు అర్హులు ఎవరు:
హోం ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నా.. ఎలాంటి జ్వరం ఉండకూడదు. బాధితుల ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు అయితే వారు స్వీయ నిర్బంధానికి అర్హులు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి దగ్గరలోని ప్రభుత్వ వైద్యాధికారి ధ్రువీకరిణ (తేలికపాటి లక్షణాలు ఉన్నాయని) పత్రం తీసుకోవాలి. ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తితో పాటు కుటుంబం క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. సదరు వ్యక్తికి కొవిడ్-19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయి ఉండాలి. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగస్థులు.. సంబంధిత మెడికల్ అధికారి సలహా మేరకే హోం ఐసోలేషన్‌లో ఉండాలి.
హోం ఐసోలేషన్‌లో చికిత్స:
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి లక్షణాలు తీవ్రమవుతుంటే.. వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. ఎప్పటికపుడు గోరు వెచ్చని నీటిని పుక్కిలించాలి. రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి. ట్యాబ్లెట్లకు జ్వరం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.
కొత్త మార్గదర్శకాలు:
# కరోనా బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండాలి.
# ఎప్పుడూ మూడు లేయర్ల మాస్క్ ఉపయోగిస్తూ.. ప్రతి 8 గంటలకోసారి మార్చుకోవాలి. 72 గంటల తర్వాత ఆ మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలి.
# కుటుంబ సభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్-95 మాస్క్‌ను ఉపయోగించాలి.
# బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.
# కరోనా సోకినా వ్యక్తి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేయాలి. అదే సమయంలో ఆవిరి పట్టాలి.
# శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి.
# బాధితులు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఎక్కువగా ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదు. గదిని శుభ్రంగా ఉంచాలి.
# ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులు పంచుకోకూడదు. వారి అవసరాలను చూసుకునే వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. బాధితుల గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. బాధితుల వస్తువులను ముట్టుకునేప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
# హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే.. 7 రోజుల తర్వాత ఐసోలేషన్ తర్వాత బయటకు రావొచ్చు. అయితే మాస్క్‌లు మాత్రం తప్పకుండా ధరించాలి. ఇక హోం ఐసోలేషన్ తర్వాత ఎలాంటి కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: Rishabh Pant Record: రిషబ్ పంత్ అరుదైన రికార్డు.. నాలుగో భారత వికెట్ కీపర్‌గా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook