India Vs South 3rd odi Africa Highlights: సఫారీ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి వన్డేలో సౌతాఫ్రికాను 78 పరుగులతో ఓడించిన భారత్.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 218 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) సెంచరీతో సత్తా చాటగా.. తిలక్ వర్మ (52) అర్ధ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్ల తేడాతో చెలరేగడంతో సఫారీ బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సంజూ శాంసన్‌కు దక్కగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డు అర్ష్‌దీప్ గెలుచుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా విధించిన 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. రీజా హెండ్రిక్స్ (19)ను అర్ష్‌దీప్ అవుట్ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. అనంతరం 76 పరుగుల వద్ద రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (2)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం డిజార్జ్, కెప్టెన్ ఐడాన్ మార్క్‌రమ్‌ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మార్క్‌రమ్‌ (36) ఔట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి ప్రోటీస్ వికెట్లు వేగంగా పతనమయ్యాయి.


టోనీ డిజార్జ్ (81) అర్ధ సెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21), వియాన్ ముల్డర్ (1), డేవిడ్ మిల్లర్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ బాటపట్టారు. కేశవ్ మహరాజ్ (14), లిజార్డ్ విలియమ్స్ (2), బ్యూరాన్ హెండ్రిక్స్ (18) కూడా వెంటవెంటనే ఔట్ అవ్వడంతో ప్రొటీస్ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయింది. అర్ష్‌దీప్‌ నాలుగు వికెట్లు తీయగా.. అవేశ్‌ ఖాన్, వాషింగ్టన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ముఖేష్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అరగేంట్ర బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా.. సంజూ శాంసన్, కెప్టెన్ కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. రాహుల్ (21) ఔట్ అయిన తరువాత సంజూ,  తిలక్ వర్మ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 135 బంతుల్లో 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ వర్మ (52) ఔట్ అయిన కాసేపటికే.. సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (38), వాషింగ్టన్ సుందర్ (14) వేగంగా పరుగులు చేసి జట్టు స్కోరు 300కు చేరువగా తీసుకువచ్చారు. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో బ్యూరెన్ హెండ్రిక్స్ 3, నాండ్రే బెర్గర్ 2, లిజార్డ్ విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు.


Also Read: Bhatti Vikramarka: అసెంబ్లీలో కరెంట్‌పై లొల్లి.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. లెక్కలు బయటపెట్టిన భట్టి..!   


Also Read: Free Bus Ticket: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. వాళ్లు టిక్కెట్‌ కొనాల్సిందే.. కొత్త రూల్స్ ఇవే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook


CM Revanth ReddyCM R