Jansen and Rabada strikes India All-Out for 174: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) 174 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని కోహ్లీసేన దక్షిణాఫ్రికా ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రోటీస్ పేసర్లు కాగిసో రబాడ (Rabada), మార్కో జాన్సెన్ (Jansen) చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (34) టాప్ స్కోరర్. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒకరు కూడా చెప్పగోదగ్గ పరుగులు చేయలేదు. ఛెతేశ్వర్‌ పుజారా (16), విరాట్ కోహ్లీ (18), అజింక్య రహానే (20) పూర్తిగా విఫలమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో నాలుగో రోజైన బుధవారం ఉదయం ఆటను ప్రారంభించిన టీమిండియాకు కాగిసో రబాడ షాక్ ఇచ్చాడు. ఓవర్‌నైట్‌ స్కోరుకు శార్దూల్‌ ఠాకూర్ (10) మరో ఆరు పరుగులు జోడించి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఛెతేశ్వర్‌ పుజారా (Pujara)తో కలిసి కేఎల్ రాహుల్ (23) ఇన్నింగ్స్‌ నిర్మించేందుకు ప్రయత్నించాడు. అయితే లుంగి ఎంగిడి వేసిన అద్భుత బంతికి రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), పుజారా ఆచితూచి ఆడారు. లంచ్ సమయానికి ఈ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా చూశారు. లంచ్‌ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.


 Also Read: Shardul Thakur: థర్డ్ అంపైర్.. నిద్ర పోతున్నావా ఏంది! శార్దూల్ ఠాకూర్ వికెట్‌పై సోషల్ మీడియాలో దుమారం!!




లంచ్‌ బ్రేక్ అనంతరం దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు. సొంతగడ్డపై ప్రొటీస్ పేసర్లు విజృంభించడంతో భారత్‌ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డారు. బోజనవిరామం అనంతరం ముందుగా విరాట్ కోహ్లీ (18) పెవిలియన్ చేరాడు. ఆపై అజింక్య రహానే (Rahane)తో ఛెతేశ్వర్‌ పుజారా ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే టీమిండియాను లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ దెబ్బకొట్టారు. పుజారా, రహానే ఔట్ అవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ విలువైన పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆపై వరుస వికెట్లు కోల్పోయిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. ఆర్ అశ్విన్ (14), మొహ్మద్ షమీ (1), మొహ్మద్ సిరాజ్ (0), జస్ప్రీత్ బుమ్రా (7) పరుగులు చేశారు. 


Also Read: Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook