Michael Vaughan urged ICC to ban or fine on Virat Kohli over DRS saga: దక్షిణాఫ్రికా, భారత్ (IND vs SA) జట్ల మధ్య ముగిసిన మూడో టెస్టులో చోటుచేసుకున్న నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)పై పెద్ద దుమారం రేగుతోంది. క్రికెట్ ప్రపంచం, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వివాదంపైనే చర్చ నడుస్తోంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ రివ్యూ (Dean Elgar DRS) విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని క్రికెట్ మాజీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటీస్ జట్టు సారథి డీన్‌ ఎల్గర్‌.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌లో తొలుత ఎల్బీడబ్ల్యూగా ఔటైనట్లు అంపైర్‌ ప్రకటించినా.. రివ్యూలో బంతి వికెట్లకుపై నుంచి వెళ్తుందని నాటౌట్‌గా ప్రకటించారు. దీనిపై కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రొటీస్ అధికార బ్రాడ్‌కాస్టర్ సూపర్‌ స్పోర్ట్‌ను ఉద్దేశించి స్టంప్ మైక్ ముందు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'బంతికి మెరుగు పెడుతున్నపుడు కేవలం ప్రత్యర్థి పైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు' అని అన్నాడు. 


Also Read: GiveNewsNotViews: ట్రెండింగ్‌లో చిరంజీవి ట్వీట్‌.. తన మద్దతు చిరుకే అంటున్న విజయ్ దేవరకొండ!!


'పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది' అని ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వ్యాఖ్యానించాడు. 'సూపర్‌ స్పోర్ట్‌.. మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి. అంతేకాని ఇలా చేయొద్దు' అని ఆర్ అశ్విన్‌ (R Ashwin) స్టంప్‌ మైక్‌ వద్ద అన్నాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ మైదానంలో వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆరా తీస్తోంది. ఈ మేరకు మ్యాచ్​ నిర్వహకులతో చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది.


టీమిండియా ఆటగాళ్ల వ్యవహారంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ (Michael Vaughan) స్పందించారు. 'ఇది భారతీయులకు వ్యక్తిగతంగా అవమానకరమని నేను భావిస్తున్నాను. కొన్ని నిర్ణయాలు మనకు వ్యతిరేకంగా వస్తుంటాయి. విరాట్ కోహ్లీ ఆటకు లెజెండ్. కానీ టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో వ్యవహరించే విధానం ఇది మాత్రం కాదు. ఐసీసీ ఈ ఘటననను సీరియస్‌గా పరిగణించాలి. ఎవరూ తప్పించుకోలేరు. విరాట్ కోహ్లీకి జరిమానా విధించాలి లేదా అతన్ని సస్పెండ్ చేయాలి' అని మైకేల్‌ వాన్‌ అన్నారు. 


Also Read: Madanapalle Road Accident: పండగ పూట విషాదం.. మదనపల్లె రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి