GiveNewsNotViews: ట్రెండింగ్‌లో చిరంజీవి ట్వీట్‌.. తన మద్దతు చిరుకే అంటున్న విజయ్ దేవరకొండ!!

చిరంజీవికి మ‌ద్ధుతుగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ట్వీట్ చేశారు. చిరు పోస్ట్ చేసిన #GiveNewsNotViews ట్యాగ్‌ను ట్వీట్ చేస్తూ.. నా పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నాను అంటూ పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 11:01 AM IST
  • ట్రెండింగ్‌లో చిరంజీవి ట్వీట్‌
  • తన మద్దతు చిరుకే అంటున్న విజయ్ దేవరకొండ
  • రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలపై స్పందించిన చిరంజీవి
GiveNewsNotViews: ట్రెండింగ్‌లో చిరంజీవి ట్వీట్‌.. తన మద్దతు చిరుకే అంటున్న విజయ్ దేవరకొండ!!

 Vijay Devarakonda supports Chiranjeevi Tweet over YSRCP MP Seat: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (AP CM YS Jagan)ని 'మెగాస్టార్' చిరంజీవి (Chiranjeevi ) గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో క‌ల‌వ‌డంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన విష‌యం తెలిసిందే. ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున మాట్లాడేందుకు చిరంజీవి సీఎంను కలవడానికి వెళ్లారని కొందరు.. వైసీపీ నుంచి చిరుకు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ వచ్చిందని ఇంకొందరు నెట్టింట ప్రచారం చేశారు. ఏపీ సీఎంతో భేటీ అనంతరం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిరు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని స్పష్టం చేశారు. ఈ విష‌య‌మై ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా చిరు ఓ పోస్టు చేశారు.

'తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం ఏపీ సీఎం శ్రీ వైస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా.. ఆ మీటింగ్‌కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్లీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నా' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

Also Read: Malaika Arora: 25 ఏళ్లకే జీవితం ముగియదు.. 40లోనూ ప్రేమను ఆస్వాదించొచ్చు! రూమర్స్‌పై ఘాటు రిప్లై ఇచ్చిన హీరోయిన్

'మెగాస్టార్' చిరంజీవి చేసిన ట్వీట్‌లో  #GiveNewsNotViews అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఫాన్స్, నెటిజ‌న్లు చిరు ట్వీట్‌ను పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చిరంజీవికి మ‌ద్ధుతుగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda) ట్వీట్ చేశారు. చిరు పోస్ట్ చేసిన #GiveNewsNotViews ట్యాగ్‌ను ట్వీట్ చేస్తూ.. నా పూర్తి మ‌ద్ద‌తు (My Full support) తెలుపుతున్నాను అంటూ పేర్కొన్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హ‌రం ఇంకా ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: Covid 19 Cases in India: అంతకంతకూ పెరుగుతోన్న కరోనా.. తాజాగా 2 లక్షల 68వేల కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News