IND vs SA: మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. సిరీస్ పాయె! ఏళ్ల కల ఆవిరయ్యే!!
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ పట్టేద్దామనుకున్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. కేప్‌టౌన్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
South Africa win the Third Test by 7 wickets and clinch the series 2-1: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ పట్టేద్దామనుకున్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ టీమిండియా మురిపించి ఉసూరుమనిపించింది. కేప్‌టౌన్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యాన్ని 63.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత జట్టు ఏళ్ల కల నెరవేరకుండానే పోయింది.
ఓవర్‌నైట్ స్కోరు 101/2తో నాలుగో రోజైన శుక్రవారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మరో వికెట్ మాత్రమే నష్టపోయి సునాయాసంగా లక్ష్యాన్ని (212) చేరుకుంది. దక్షిణాఫ్రికా విజయంలో కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో 10×4) కీలక కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (30) ఔట్ అయినా.. వాండర్ డస్సెన్ (41), తెంబా బవుమా (32) మిగతా పని పూర్తి చేశారు. నాలుగో రోజు ఏ దశలోనూ భారత్ విజయం దిశగా సాగలేదు. ఇదే పిచ్‌పై ప్రొటీస్ బౌలర్లు చెలరేగితే.. భారత బౌలర్లు మాత్రం తేలిపోయాయిరు. స్టార్ పేసర్లు బుమ్రా, షమీ, శార్దూల్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read: PV Sindhu - India Open: పీవీ సింధు విజయ పరంపర.. ఇండియా ఓపెన్ సెమీ ఫైనల్స్‌కు తెలుగు తేజం!!
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79: 201 బంతుల్లో 12×4, 1×6), టెస్ట్ స్పెసలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా (43: 77 బంతుల్లో 7×4) మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, మార్కో జాన్సన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 210 పరుగులకే ఆలౌట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ తలో రెండు వికెట్లు తీశారు.
13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 198 పరుగులకే పరిమితం అయింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (100: 139 బంతుల్లో 6×4, 4×6) శతకంతో రాణించినా.. మిగతా వారు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29) ఒక్కడే కాసేపు క్రీజులో నిలబడ్డాడు. స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7), ఛెతేశ్వర్ పుజారా (9), అజింక్య రహానే (1) విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోహ్లీసేన నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మూడో టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది.
Also Read: AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్ పాజిటివ్- 18 వేలపైకి యాక్టివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook