Ind vs SA T20 Match: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. మొదటి రెండు టీ20లను గెల్చుకున్న టీమ్ ఇండియాకు ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో మాత్రం పరాజయం ఎదురైంది. 49 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించి..సిరీస్ వైట్‌వాష్ కాకుండా తప్పించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా 30 పరుగుల స్కోర్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఆ తరువాత డికాక్, రుసోలు నిదానంగా ఆడుతూ 8 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేశారు. ఆ తరువాత మూడు ఓవర్లలో చెలరేగిపోయి 46 పరుగులు జోడించారు. స్కోర్ 120 ఉండగా దక్షిణాఫ్రికా రెండవ వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి అదే రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి..22 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 


ఆ తరువాత 228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 18 పరుగులు సాధించింది. 45 పరుగుల వద్ద మూడవ వికెట్ కోల్పోయింది. 78 పరుగుల వద్ద దినేష్ కార్తిక్ 46 పరుగుల స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. సిరీస్‌లో విజృంభించి ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ ఈసారి కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు. 114 పరుగుల స్కోర్ వద్ద టీమ్ ఇండియా 7వ వికెట్ కోల్పోయింది. అలా 178 పరుగులకు టీమ్ ఇండియా ఆలవుట్ అవడంతో 49 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చివరి టీ20లో విజయం దక్కించుకుంది. 


టీమ్ ఇండియా తరపున దినేష్ కార్తిక్ 46 పరుగులు మినహా మరెవరూ చెప్పుకోదగ్గ రన్స్ సాధించలేదు. అటు సౌత్ ఆఫ్రికా తరపున రిలీ రోసౌవ్ అద్భుత సెంచరీ సాధించాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. 


Also read: Shoaib Akhtar Comments: పాక్‌ జట్టు తొలి రౌండ్లోనే ఓడిపోతుందేమో..: షోయబ్‌ అక్తర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook