IND vs SA: వీరా భారత భావి ఓపెనర్లు..గైక్వాడ్, ఇషాన్ కిషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్..!
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పూర్తిగా నిరాశ పర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమయ్యింది. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడినా..ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో ఓటమిని రుచి చూసింది. తొలుత సఫారీ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం భారత్ 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పిచ్ తడిగా ఉండటంతో పరుగులు చేయడం ఇబ్బందిగా మారింది.
ఐనా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వీరోచితంగా ఆడి..భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచారు. టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన భారత్..ఆది నుంచి తడబడింది. తడిగా మారిన పిచ్‌పై పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. టీమిండియా యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అష్టకష్టాలు పడ్డారు. మరి నెమ్మదిగా ఆడాడు. ఇదే భారత్ ఓటమికి కారణమయ్యిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈక్రమంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఐపీఎల్‌లో ఇరగదీసే గైక్వాడ్, ఇషాన్ కిషన్..జాతీయ జట్టులో జిడ్డుగా ఆడారని మీమ్స్, జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు. ఈమ్యాచ్‌లో ఖాతా తెరిచేందుకు రుతురాజ్ గైక్వాడ్ 10 బంతులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూడా పుంజుకోలేకపోయాడు. చివరకు 42 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇటు ఇషాన్ కిషన్ సైతం ఇదే రీతిలో బ్యాటింగ్ చేశాడు.
37 బంతులు ఆడి 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇలా వీరు బ్యాటింగ్ చేయడం వల్లే చివర్లో రన్‌రేట్ పెరిగిందని అభిమానులు మండిపడుతున్నారు. యువ ప్లేయర్లు సైతం తమ స్వార్థం కోసం ఆడారని..దేశం కోసం ఆడలేదని ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ వైరల్‌గా మారాయి. వీరా భారత భావి ఓపెనర్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read:Minister KTR: రాబోయే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్..మా స్కెచ్ అదేనన్న మంత్రి కేటీఆర్..!
Also read:Viral Video: వామ్మో ఇదేమి రా సామీ..చెట్టును ఇలా ఎక్కేసింది..కొండ చిలువ వీడియో వైరల్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook