Virat Kohli - DRS: కేవలం ప్రత్యర్థి పైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి! మరోసారి డీఆర్‌ఎస్ దుమారం!!
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో డీఆర్‌ఎస్ దుమారం రేగింది.
Virat Kohli slams Broadcasters After Dean Elgar Survives Due To DRS Gaffe: అంపైర్, ప్లేయర్స్ మధ్య నిత్యం వివాదమవుతున్న నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)పై మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో డీఆర్‌ఎస్ (DRS) దుమారం రేగింది. కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్టు (Cape Town Test) మూడో రోజు ఆటలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) బౌలింగ్‌లో ప్రొటీస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ (Dean Elgar) సమీక్షలో నాటౌట్‌గా తేలడమే అందుకు కారణం. డీఆర్‌ఎస్‌పై టీమిండియా ప్లేయర్స్ అసహనం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే...
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి డీన్ ఎల్గర్ షాట్ ఆడగా.. అతడి ప్యాడ్‌ను తాకింది. వెంటనే ఎల్బీ (LBW) కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్ ఔటిచ్చాడు. ఎల్గర్ వెంటనే రివ్యూ కోరాడు. సమీక్ష కోరిన ఎల్గర్ కూడా రిప్లేలో మొదట బంతి గమనాన్ని చూసి పెవిలియన్ బాట పట్టాడు. కానీ చివరకు బంతి స్టంప్‌ల మధ్యలో పిచ్ అయినా.. వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇంకేముంది ప్రొటీస్ కెప్టెన్ తిరిగొచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు.
Also Read: LPG cylinder Rs 587 : రూ.900 ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ రూ.587కు పొందే అవకాశం
స్టంప్స్‌పై నుంచి బంతి వెళ్తుందని సమీక్షలో చూపించడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (VIrat Kohli on DRS) అసహనం వ్యక్తం చేశాడు. అది (డీన్ ఎల్గర్) కీలక వికెట్ కావడంతో దక్షిణాఫ్రికా అధికార ప్రసారదారైన సూపర్ స్పోర్ట్ (Super Sports)ను ఉద్దేశించి స్టంప్ మైక్ దగ్గరకు వెళ్లి వ్యాఖ్యలు చేశాడు. 'బంతికి మెరుగు పెడుతున్నపుడు కేవలం ప్రత్యర్థి జట్టు పైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు. ఇది మీకు న్యాయమేనా' అని విరాట్ అన్నాడు. 'పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది' అని ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వ్యాఖ్యానించాడు.
'సూపర్ స్పోర్ట్.. మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి. అంతేకాని ఇలా చేయొద్దు' అని ఆర్ అశ్విన్ స్టంప్ మైక్ వద్ద అన్నాడు. అంపైర్ ఎరాస్మస్ కూడా మైదానంలోని భారీ తెరపై రిప్లే చూస్తూ 'అది అసాధ్యం' అన్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. టీమిండియా ఫాన్స్ (Indian Fans) కూడా తన నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట ముగిశాక ఈ డీఆర్‌ఎస్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ ఆంబ్రే కూడా అసహనం వ్యక్తం చేశాడు.
Also Read: Daggubati Rana on Hero Movie : అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్న రానా దగ్గుబాటి.. ఆ టైటిల్ రావడం లక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి