LPG cylinder Rs 587 : రూ.900 ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ రూ.587కు పొందే అవకాశం

Subsidy on LPG cylinder, LPG gas cylinder Rs 587 : ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. సిలిండర్ సబ్సిడీ తగ్గింది. అయితే త్వరలో రూ.587కే సిలిండర్ పొందే వెసులు బాటు రానుంది. అది ఎలాగంటే..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 02:43 AM IST
  • సామాన్యుడిపై భారంగా సిలిండర్ ధర
  • భారీగా తగ్గిన సబ్సిడీ..
  • మళ్లీ పెరగనున్న సబ్సిడీ..
  • రూ.587కే సిలిండర్
LPG cylinder Rs 587 : రూ.900 ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ రూ.587కు పొందే అవకాశం

Subsidy on LPG cylinder started again LPG gas cylinder will be available Rs 587 : ఈ మధ్య కాలంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యుడిపై ఇది సిలిండర్ ధర కాస్త భారంగానే మారింది. అంతేకాదు గతంలో సబ్సిడీగా (Subsidy) వచ్చే డబ్బులను (Money) కూడా అమాంతం తగ్గించారు. రూ.30, రూ.40 మాత్రమే ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం (Government) మళ్లీ సబ్సిడీని పెంచనుంది. 

పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలతో (LPG cylinders Price ) ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పలు నగరాల్లో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.900 (Rs.900) నుంచి 950 వరకు ఉంది.

అయితే మరికొన్ని రోజుల్లో మళ్లీ మునుపటి మాదిరిగానే ఎల్‌పీజీ సిలిండర్‌పై అర్హులైన వారందరికీ సబ్సిడీ (Subsidy) అందనుంది. ఇదే జరిగితే.. మళ్లీ ఎల్‌పీజీ సిలిండర్‌‌ విషయంలో సామాన్యులకు కాస్త భారం తగ్గుతుంది. సబ్సిడీ అందండం వల్ల సిలిండర్ ధర (Cylinder price) తగ్గినట్లు అవుతుంది. 

త్వరలోనే ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీని పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కూడా ఆర్థిక శాఖకు పంపారు. ఆర్థిక శాఖకు వెళ్లిన ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మళ్లీ సిలిండర్‌‌పై సబ్సిడీ (Subsidy on cylinder) అందుతుంది. 

Also Read : Covaxin Universal vaccine: యూనివర్సల్​ వ్యాక్సిన్​గా భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్'!

అయితే తాజాగా ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనల్లో జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్‌పీజీ సిలిండర్‌‌పై సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా వెంటనే సబ్సిడీని (Subsidy) అందజేయాలని కోరారు. ఇక ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే.. మళ్లీ రూ.303 సబ్సిడీ (Rs.303 subsidy) అందే అవకాశం ఉంది. అంటే అప్పుడు రూ.900 సిలిండర్‌‌ (Cylinder) ధర ఉంటే.. రూ.587 (Rs.587) మాత్రమే చెల్లించినట్లు అవుతుంది.

Also Read : PM Modi Meet With CMs: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం- కొవిడ్ పరిస్థితులపై చర్చ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News