Virat Kohli To miss South Africa ODIs due to Vamika's Birthday: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) రూపంలో టీమిండియా (Team India)కు ఇప్పటికే భారీ షాక్ తగలగా.. మరో ఎదురుదెబ్బ కూడా తగలనుంది. గాయం కారణంగా టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ దక్షిణాఫ్రికా (South Africa) సిరీస్‌కు దూరం కాగా.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడట. మంగళవారం ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. డిసెంబర్ 26 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుండగా.. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. త్వరలోనే దక్షిణాఫ్రికా గడ్డపైకి భారత్ వెళ్లనుంది. 16న ముంబై నుంచి భారత్ బయలుదేరుతుందని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్‌ శర్మకు బీసీసీఐ (BCCI) బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు నుంచి స్వయంగా తప్పుకున్న కోహ్లీ.. వన్డే, టెస్ట్‌లకు మాత్రం సారధి కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్ ఉండాలని భావించిన బీసీసీఐ.. అనూహ్యంగా కోహ్లీపై వేటు వేసింది. బీసీసీఐ నిర్ణయం విరాట్‌ను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ (ODI Series)కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: Vivo V23 Pro: అతి త్వరలోనే మార్కెట్‌లోకి వివో V23 ప్రో.. ఫీచర్స్ అదిరిపోలా! ధర ఎంతంటే?


మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు మంగళవారం ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. యథావిధిగా రోహిత్‌ వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహిస్తాడని సదరు అధికారి వెల్లడించారు. కోహ్లీ వన్డే సిరీస్‌కు దూరం కావడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. జనవరిలో తన కుమార్తె వామిక బర్త్‌డే ఉండడంతో.. విరాట్ తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని, వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనని చెప్పినట్లు తెలుస్తోంది.


Also Read: Virata Parvam: అదిరిపోయిన రానా 'వాయిస్ ఆఫ్ రవన్న'.. రివల్యూషనరీ పొయెటిక్ సెన్స్...


దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఆదివారం ముంబైలో ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయం అయింది, రోహిత్ తొడ కండరాల గాయం బారిన పడటంతో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అతడి స్థానంలో ప్రియాంక్‌ పాంచాల్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే సిరీస్‌కు దూరం అవుతున్నాడని తెలిసింది. టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం కాగా, ఇప్పుడు విరాట్‌ కూడా వన్డే సిరీస్‌కు దూరం కానుండడం విశేషం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి