India post 200 target to Sri Lanka: టీ20ల్లో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. శ్రీలంక‌పై కూడా ఆ ఫామ్ కొనసాగిస్తోంది. లక్నో వేదిక‌గా లంకతో జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసి.. శ్రీలంక ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇషాన్ కిషన్ (89; 56 బంతుల్లో 10x4, 3x6), శ్రేయాస్ అయ్యర్ (57; 28 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ (44; 32 బంతుల్లో 2x4, 1x6) కీలక పరుగులు చేశాడు. లంక బౌలర్లు లహిరు కుమార, దాసున్ శనక తలో వికెట్ తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడారు. రోహిత్ తన శైలికి బిన్నంగా కాస్త నెమ్మదిగా ఆడగా.. ఇషాన్ ఎప్పటిలానే రెచ్చిపోయాడు. లంక బౌలర్లపై విరుచుకుపడిన యువ ఓపెనర్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ జోడీని విడదీసేందుకు లంక బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇషాన్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్, ఇషాన్ తొలి వికెట్​కు 111 పరుగులు జోడించారు.


12వ ఓవర్ ఐదవ బంతికి 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. లహిరు కుమార బౌలింగ్​లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్​ అయ్యర్ కూడా ధాటిగానే ఆడాడు. ఇద్దరు కలిసి టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 16వ ఓవర్లో ఇషాన్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో కూడా ఓ ఫోర్ బాది ఔట్ అయ్యాడు. ఆపై శ్రేయాస్ టాప్ గేర్ మార్చి అర్ధ శతకం అందుకున్నాడు. చివరకు రవీంద్ర జడేజా 3 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో లహిరు కుమార, దసున షనక తలో వికెట్ తీశారు.  


Also Read: Reena Dwivedi New Look: అప్పుడు ఎల్లో సారీ.. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్‌! ఈ ఎలక్షన్ ఆఫీసర్‌ది చూపుతిప్పుకోని అందం!!


Also Read: Bigg Boss OTT Promo: మీ మొబైల్స్ ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి.. నో కామ, నో ఫుల్‌స్టాప్: నాగార్జున


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook