మొహాలీలోని ఐ.ఎస్.బింద్రా స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమయ్యింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ను ఎంచుకోగా. .భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ధర్మశాల మొదటి వన్డే మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియా ఎలాగైనా వన్డేలో గెలవాలని పట్టుదలతో ఉండగా.. రెండో మ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ నిలబెట్టుకోవాలని శ్రీలంక ప్రయత్నిస్తోంది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ లను క్రీజులో దింపింది. కడపటి వార్తలందేసరికి  8 ఓవర్లలో భారత్ 29 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ 13 పరుగులు , శిఖర్ ధావన్ 16 పరుగులు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశం జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్  పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్  మరియు యజువేంద్ర చాహల్. 


శ్రీలంక జట్టు: థిసారా పరెరా (కెప్టెన్), ఉపుల్ త్న్రగా, దనుష్క గునాటిల్కే, లాహిరు తిరుమన్నే, అసేలా గుణరత్నే, నిరోషన్ డిక్వెలా (వికెట్ కీపర్), స్కిత పతిరనా, సునృగ లక్మల్, అకిల కాగా, ధనంజయ మరియు నువాన్ ప్రదీప్.