IND vs SL 2nd T20: శ్రీలంకతో టీ20 సిరీస్​ను టీమిండియా (Team India) కైవసం చేసుకుంది. రెండో టీ20 మ్యాచ్​లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఆజేయంగా 74 పరుగులు (44 బంతుల్లో), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 45 నాటౌట్ (18 బంతుల్లో) తో చెలరేగంతో భారత్ విజయం సాధించింది. సంజూ శాంసన్ 39 పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో కుమార 2, చమీర 1 వికెట్ తీశారు. 


అంతకముందు టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నిస్సంక 75, షనక 45, గుణతిలక 38 పరుగులు చేయటంతో...లంక (Srilanka) టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. మరో గెలుపు సాధించి..ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 


Also Read: IND vs SL 2nd T20: రుతురాజ్ ఫిట్.. ఆ ఆటగాడిపై తప్పని వేటు! లంకతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook