Rohit Sharma: సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైంది.. ట్రోలింగ్‌పై రోహిత్ శర్మ ఫైర్!
Rohit Sharma says Now a Days Social Media is a Too Much Crap. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు.
Rohit Sharma says Now a Days Social Media is a Too Much Crap: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌ను భారత జట్టు సభ్యులు ఎవరూ పట్టించుకోరని తెలిపాడు. చివరి ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని హిట్‌మ్యాన్ ప్రశంసించాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత్ ఆసియా కప్ 2022 నుంచి దాదాపుగా నిష్క్రమించింది. సాంకేతికంగా చూస్తే భారత్ ఫైనల్ చేరేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. భారత్ భవితవ్యం ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్టులపై ఆధారపడి ఉంది.
సూపర్ 4లో భాగంగా ఆదివారం ఉత్కంతంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచులో కీలక పరుగులు చేసిన అసిఫ్ అలీ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ వదిలేశాడు. దాంతో అర్ష్‌దీప్‌పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అలానే పాకిస్తాన్, శ్రీలంక జట్లపై 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇవ్వడంపై కూడా నెట్టింట మీమ్స్, కామెంట్స్ వచ్చాయి. మరోవైపు రోహిత్ శర్మ సారథ్యంపైనా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ విమర్శలపై తాజాగా రోహిత్ స్పందించాడు.
శ్రీలంతో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైంది. కెమెంట్స్, మీమ్స్ దారుణంగా ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే.. ఆ ట్రోల్స్‌ను భారత జట్టు ప్లేయర్స్ అస్సలు పట్టించుకోరు. క్రికెట్‌లో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు గెలుస్తాం, మరికొన్నిసార్లు ఓడిపోతాం. ఒత్తిడి సమయంలో ప్లేయర్స్ క్యాచ్‌లను నేలపాలు చేస్తుంటారు. ఇలాగే అర్ష్‌దీప్ సింగ్ కూడా క్యాచ్‌ను చేజార్చాడు. దానికి చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అంతేకానీ సోషల్ మీడియా ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు' అని అన్నాడు.
'పాకిస్తాన్ జట్టుపై చివరి ఓవర్ వేసేందుకు చాలా ఆత్మవిశ్వాసంతో అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు. అసిఫ్ అలీ వికెట్‌ను కూడా తీశాడు. మంచి ప్రదర్శన చేశాడు. మానసికంగా బలంగా లేకపోతే ఆడటం చాలా కష్టమవుతుంది. శ్రీలంకపైనా ఎంతో చక్కగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో 7 పరుగులు కాపాడుకోవడం కష్టం. అయినా ఐదో బంతి వరకు మ్యాచును తీసుకొచ్చాడు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Also Read: షమీ ఇంట్లో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది.. జట్టు ఎంపికపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఫైర్!
Also Read: నిఖిల్‌కు నితిన్‌కు ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదా నాయనా.. బీజేపీ లీడర్లను ఆటాడుకుంటున్న నెటిజన్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook