JP Nadda wanted to meet Karthikeya 2 Hero Nikhil in place of Nithiin: బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న 'ప్రజా సంగ్రమయాత్ర' మూడో దశ ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. హన్మకొండలో జరిగిన సభలో ప్రసంగించిన జేపీ నడ్డా.. నేరుగా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో బస చేశారు. అక్కడ టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, హీరో నితిన్‌ను కలిసి ఆయన మాట్లాడారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది.
జేపీ నడ్డాతో భేటీ అనంతరం మిథాలీ రాజ్ రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. మిథాలీ ఎలాగూ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు కాబట్టి.. ఆ వార్త నిజమే అనుకున్నారు. అయితే హీరో నితిన్‌ను నడ్డా ఎందుకో కలిశారో అని అందరూ అయోమయానికి గురయ్యారు. అయితే నితిన్‌ను నడ్డా కలవడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు నితిన్‌ను నడ్డా కలవనుకోలేదట. నిఖిల్‌ను కలవబోయి నితిన్‌ను కలిశారట. విషయం ఏంటంటే...
నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2' చిత్రం ఆగస్టు 12న విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కార్తికేయ-2 మంచి వసూళ్లు రాబట్టింది. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్లో ఇప్పటివరకు 30 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించింది. ఎలాంటి ప్రమోషన్లు చేయకున్నా ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం విశేషం. శ్రీ కృష్ణుడి నేపథ్యంలో సాగిన కథ నచ్చడంతో బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నిఖిల్‌ను కలవరనుకున్నారట. ఇదే విషయాన్ని ఇక్కడి బీజేపీ నాయకులకు చెప్పారట.
బీజేపీ లీడర్లు పొరబడి.. కార్తికేయ-2 హీరో నిఖిల్‌ను పిలవబోయి నితిన్‌ను పిలిచారట. ఇంకేముంది నితిన్‌ను జేపీ నడ్డా కలిశారు. మరి ఈ విషయం ఎలా బయటికి వచ్చిందో, ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మీమ్స్ చేసి బీజేపీ లీడర్లను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. 'నిఖిల్‌ను పిలవబోయి నితిన్‌ను పిలిచారట', 'బీజేపీ లీడర్లకు ఆ మాత్రం తేడా తెలియట్లేదా', 'నిఖిల్‌కు నితిన్‌కు ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదా నాయనా', 'ఈ గందరగోళం ఏంటి మావా' అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Also Read: ప్రెస్మీట్లో పాల్గొనేటప్పుడు ఆ మాత్రం కూడా తెలియదా.. రిపోర్టర్‌పై హీరోయిన్ ఫైర్!
Also Read: kids in Car Boot: కారు డిక్కీలో పిల్లలు.. షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook