IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. నలుగురు సీనియర్ ఆటగాళ్లకు దక్కని చోటు! ఇక అంతే సంగతులా?
IND vs SL: Pujara and Rahane out from Indian Test squad. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు దూరమయ్యారు.
Cheteshwar Pujara, Ajinkya Rahane dropped for Sri Lanka Test series: త్వరలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా కేఎల్ రాహుల్ ఈ పర్యటనకు దూరం కాగా.. పేసర్ జస్ప్రీత్ బూమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20, టెస్టు సిరీస్‌లకు 18 మంది చొప్పున ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే సీనియర్ ఆటగాళ్లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు దూరమయ్యారు. వీరిని కేవలం ఈ రెండు టెస్టుల నుంచి మాత్రమే తప్పించామని, దేశవాళీ క్రికెట్ ఆడి తన ఫామ్ నిరూపించుకోవాలని గతంలోనే చెప్పామని భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ చెప్పారు. గత కొంతకాలంగా పుజారా, రహానే ఫామ్‌లో లేకపోవడంతోనే వారిని పక్కన పెట్టారు. వీరిద్దరినీ జట్టు నుంచి తప్పిస్తారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. టెస్ట్ జట్టు ప్రకటించడానికి ముందు రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రపై రహానే సెంచరీ చేయగా.. పుజారా డకౌట్ అయ్యాడు.
ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధమాన్ సాహాలను కూడా శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ పక్కన పెట్టింది. కొంత కాలంగా ఇషాంత్ ఫిట్‌నెస్, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. సాహా కూడా ఇటీవలి కాలంలో పెద్దగా రాణించిన దాఖలు లేవు. మొహ్మద్ సిరాజ్, దీపక్ చహర్, అవేశ్ ఖాన్, రిషబ్ పంత్, కేఎస్ భారత్ లాంటి ప్లేయర్స్ అందుబాటులో ఉండడంతో ఇషాంత్, సాహాలు మళ్లీ జట్టులోకి రావడం కాస్త కష్టమే అని చెప్పాలి. పుజారా, రహానేలు ఫామ్ నిరూపించుకుంటే.. అవకాశాలు రానున్నాయి.
భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్.
Also Read: Thalapathy Vijay apology: వారికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో విజయ్..
Also Read: Prabhas Amitabh: కల నిజమైందంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook