Wasim Jaffer heap praise on KL Rahul after hits 64 vs Sri Lanka: గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. 215 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత బ్యాటర్లు.. లంక బౌలర్ల ధాటికి తడబడ్డారు. ఐదవ స్థానంలో బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ (64 నాటౌట్: 103 బంతుల్లో 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. వికెట్ ఇవ్వకుండా నెమ్మదిగా పరుగులు చేసి అర్ధ శతకం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌, టీ20 ప్రపంచకప్‌లలో లోకేష్ రాహుల్‌ ప్రతి ఇన్నింగ్స్‌ని పరిశీలిస్తున్నా. బ్యాటింగ్‌ సరిగ్గా ఆడకపోతే మన కళ్లు త్వరగా పసిగడతాయి. ఏడాది కాలం నుంచి రాహుల్‌ ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదు. రాహుల్ ఒక క్లాస్‌ ప్లేయర్‌ అయినప్పటికీ.. పెద్ద సందర్భాల్లో ప్రేక్షకుల అంచనాల మేర రాణించలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్ పంత్, సంజూ శాంసన్‌ వంటి ఆటగాళ్లు రాహుల్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి వేచి ఉన్నారు. అందుకే ప్రతి ఇన్నింగ్స్‌ అతడికి చాలా కీలకమైంది' అని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు.  


కేఎల్ రాహుల్ బ్యాటింగ్ నం. 5లో నిలకడగా రాణిస్తూ వికెట్ కీపింగ్ చేసినంత కాలం వన్డే జట్టులో అతని స్థానానికి ఎటువంటి ముప్పు ఉండదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 'శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కేఎల్ రాహుల్‌ జట్టు విజయానికి అవసరమైన కీలక పరుగులు చేయడం గొప్ప విషయం. అతడు తిరిగి మంచి ఫామ్‌ పొందడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడుతుంది. రాహుల్‌ మంచి ఆటగాడు. ఇక తిరిగి తన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. నిలకడగా రాణిస్తూ.. వికెట్ కీపింగ్ చేసినంత కాలం వన్డే జట్టులో అతని స్థానానికి ఎటువంటి ముప్పు ఉండదు. అతనిని టచ్ చేయడం కూడా కష్టం. రాహుల్ ఫిట్‌గా ఉన్న తర్వాత ఆ స్థానం కోసం రిషబ్ పంత్ పోటీ పడతాడు' అని జాఫర్ పేర్కొన్నాడు. 


'ప్రస్తుతానికి నంబర్ 5 లో లోకేష్ రాహుల్‌ను మించి ఆలోచించడం కష్టం. ఇతర ఫార్మాట్‌లలో తరచుగా వార్తల్లో ఉంటున్నాడు. కానీ మిడిల్ ఆర్డర్‌లో అతని వన్డే గణాంకాలు బాగున్నాయి. ఖచ్చితంగా ఫస్ట్-క్లాస్‌గా ఉంటాయి. ఇదే ఫామ్ కొనసాగిస్తే.. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అతడు కీలక ప్లేయర్ అవుతాడు' అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. 


Also Read: Maruti New SUV: హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లకు పోటీగా.. మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్‌యూవీ!  


Also Read: KL Rahul: బంతి అలా వస్తుంటే.. ఆడటం నాకు చాలా ఇష్టం: కేఎల్ రాహుల్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook