West Indies Won By 4 Runs in 1st T20I Match: టెస్ట్, వన్డే సిరీస్‌లు గెలిచి జోరు మీదున్న భారత్‌కు తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్రేకులు వేసింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను 4 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీయత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (39, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఈ విజయంతో విండీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు జేసన్ హోల్డర్ (2/19)కు దక్కింది. రెండో టీ20 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 ఓవర్లు.. 150 పరుగుల లక్ష్యం.. చివరి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఊపు చూస్తే.. ఈ టార్గెట్‌ తక్కువనిపించింది. కానీ బరిలోకి దిగిన తరువాత సీన్ రివర్స్ అయింది. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (3), ఇషాన్ కిషన్ (6) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరిపోయారు. సూర్యకుమార్ యాదవ్ (21) కాసేపు క్రీజ్‌లో కుదుకోగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వరుసగా రెండు సిక్సర్లతో అంతర్జాతీయ పరుగుల వేటను మొదలు పెట్టాడు. వీరిద్దరు రాణించడంతో 9 ఓవర్లలో 66/2తో పటిష్టంగానే కనిపించింది.


కానీ వరుస ఓవర్లలో సూర్య కుమార్ యాదవ్‌ను హోల్డర్ ఔట్ చేయగా.. తిలక్‌ వర్మను షెపర్డ్‌లు పెవిలియన్‌కు పంపించాడు. దీంతో జట్టు కష్టాల్లో పడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా‌ (19 బంతుల్లో 19 3 ఫోర్లు), సంజూ శాంసన్‌ (12) క్రీజ్‌లో కుదురుకోవడంతో 15 ఓవర్లలో 113 పరుగులతో గాడిన పడినట్లే అనిపించింది. అయితే 16వ ఓవర్‌ మ్యాచ్‌ గతిని మార్చేసింది. హార్దిక్‌ను హోల్డర్ బౌల్డ్ చేయగా.. శాంసన్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 


చివర్లో అక్షర్ పటేల్ (11 బంతుల్లో 13, ఒక సిక్స్), అర్ష్‌దీప్ సింగ్ (7 బంతుల్లో 12, 2 ఫోర్లు) ఆశలు రేకెత్తించినా.. విండీస్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్‌లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. షెపర్ట్ రెండు వికెట్లు తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్, షెపర్డ్, మెకాయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. హోసీన్‌ ఒక వికెట్ తీశాడు.


అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్‌ జట్టును భారీ స్కోరు చేయకుండా భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (48, 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (41, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ బ్రాండన్ కింగ్ (28, 19 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. టీమిండియా వరుస విరామల్లో వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో చాహల్, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు తీయగా.. పాండ్యా, కుల్దీప్ తలో వికెట్ తీశారు.


Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి  


Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..! 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook