Tomato Prices May Touch Rs 300 Per Kilogram: టమాట ధరలు ఇప్పట్లో సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎప్పుడో వంటింట్లో టమాట మాయమవ్వగా.. ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు. రోజురోజుకు పెరుగుతున్న టమాట రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో టమాట ధర కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు హెచ్చరించడంతో టమాటా ధరలకు మరింత రెక్కలు వస్తున్నాయి. టమాటా మాత్రమే కాదు.. మిగిలిన కూరగాయల ధరలు కూడా మరితం పెరుగుతాయని చెబుతున్నారు. టమోటాలు, క్యాప్సికమ్, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు విపరీతంగా పెరగడంతో తాము గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటున్నామని టోకు వ్యాపారులు అంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం టమాట భారీ ధర పలికింది. మదర్ డెయిరీ కిలో టమోటాను రూ.259కి విక్రయించింది. నేడు తమ రిటైల్ స్టోర్‌లలో కిలో రూ.10 నుంచి రూ.249 వరకు తగ్గింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మార్కెట్ పరిస్థితి మరింత దిగజారింది. సరఫరాకు అంతరాయం ఏర్పడడంతోపాటు పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఒకవైపు మార్కెట్‌లో కూరగాయల కొరత ఏర్పడుతుండగా.. మరోవైపు ధరలు భారీగా భగ్గుమంటున్నాయి.
ముఖ్యంగా ఎప్పుడో కొండెక్కి కూర్చున్న టమాట ధరలు మాత్రం దిగిరానంటున్నాయి. త్వరలోనే టమాట కేజీ రూ.300 చేరుకుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ సభ్యుడు కౌశిక్ మాట్లాడుతూ.. టమోటా, క్యాప్సికం వంటి అనేక సీజనల్ కూరగాయల ధరలు భారీగా పెరగడంతో వాటి అమ్మకాలు బాగా తగ్గిపోయినట్లు తెలిపారు. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు రిటైల్ వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.160 నుంచి రూ.220కి పెరిగిందని.. దీంతో రిటైల్ మార్కెట్‌లోనూ ఈ కూరగాయ ధర పెరుగుదల ఉంటుందన్నారు.
గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో టమాట పంటలపై తీవ్రప్రభావం పడింది. ఇదే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లోనూ నెలకొనడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. అన్ని ప్రాంతాల్లో దాదాపు కిలో టమాట రూ.200 పలుకుతోంది. టమాట క్వాలిటీ, రకం బట్టి 250 రూపాయల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి పక్కనే ఉన్న నోయిడాలో మాత్రం టమాటా కిలో 300 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో కూడా కేజీ టమాట రూ.200 వరకు పలుకుతోంది.
Also Read: IND vs WI: భారత కుర్రాళ్లకు పరీక్ష.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేటి నుంచే..
Also Read: Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook