Rohit Sharma got out for a Golden Duck in IND vs WI 2nd T20I: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో హాఫ్ సెంచరీ (64)తో సత్తాచాటిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో టీ20లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔట్‌ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మెక్‌కాయ్ షార్ట్ పిచ్ బాల్‌ వేయగా.. రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి బ్యాక్ వర్డ్ పాయింట్‌ల విండీస్ ఫీల్డర్ అకీల హోస్సెన్‌కు చిక్కాడు. దాంతో హిట్‌మ్యాన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ గోల్డెన్ డక్‌తో రోహిత్ శర్మ తన పేరిట ఓ చెత్త రికార్డును లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు గోల్డెన్ డకట్ అయిన రెండో ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.  దిల్షాన్ నాలుగు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్‌లు 3 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో ఉన్నారు. తాజాగా రోహిత్‌ ఈ ఇద్దరి సరసన చేరాడు. 


ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔటైన మూడో భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 2016లో  జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. 2021లో శ్రీలకంతో జరిగిన మ్యాచులో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌ ఫస్ట్ బాల్‌కే పృథ్వీ షా వెనుదిరిగాడు. ఇక టీ20ల్లో గోల్డన్‌ డకౌట్‌ అయిన రెండో భారత కెప్టెన్‌గా కూడా రోహిత్‌ రికార్డుల్లో నిలిచాడు. ఇటీవల శ్రీలంక సిరీస్‌పై టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గోల్డన్‌ డకౌట్‌ అయ్యాడు. రోహిత్‌ టీ20ల్లో  గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగడం ఇది 8వ సారి కావడం విశేషం. 



Also Read: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. కారణం వర్షం, లగేజీ సమస్య మాత్రం కాదు!


Also Read: శ్రీమతి శ్రీనివాస్ తెలుగు సీరియల్ నటుడిపై దాడి.. ఆ మాట చెబుతున్నా వినకుండా!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook