IND vs WI 3rd T20I Start Time: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. కారణం వర్షం, లగేజీ సమస్య మాత్రం కాదు!

India vs West Indies 3rd T20I to be delayed by 90 minutes. భారత్ vs వెస్టిండీస్‌ మూడో టీ20 మ్యాచ్‌కు లగేజీ సమస్య లేకున్నా.. గంటన్నర ఆలస్యంగా గేమ్ ఆరంభం కానుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 2, 2022, 02:04 PM IST
  • మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే
  • కారణం వర్షం, లగేజీ సమస్య మాత్రం కాదు
  • విండీస్ బోర్డు క్షమాపణలు
IND vs WI 3rd T20I Start Time: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. కారణం వర్షం, లగేజీ సమస్య మాత్రం కాదు!

West Indies vs India 3rd T20I match start at 9.30 PM: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య సోమవారం (ఆగష్టు 1) జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం అయిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సిన రెండో టీ20 మ్యాచ్.. మూడు గంటలు ఆలస్యంగా   రాత్రి 11 గంటలకు స్టార్ అయింది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ నుంచి సెయింట్ కిట్స్‌కు చేరాల్సిన ఆటగాళ్ల లగేజీ సమయానికి రాకపోవడంతోనే మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం అయింది. ఈ అసౌకర్యానికి అభిమానులు, స్పాన్సర్స్, బ్రాడ్‌కాస్ట్ పార్ట్‌నకు విండీస్ బోర్డు క్షమాపణలు చెప్పింది.

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈరోజు (ఆగష్టు 2) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 మ్యాచ్ జరిగిన సెయింట్ కిట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ మైదానంలోనే నేడు మ్యాచ్ జరగనుంది. అయితే నేటి మ్యాచ్‌కు లగేజీ సమస్య లేకున్నా.. గంటన్నర ఆలస్యంగా గేమ్ ఆరంభం కానుందని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. రెండో టీ20 మ్యాచ్‌ ఆలస్యంగా ముగిసిందని, మూడో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతినిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని విండీస్ బోర్డు పేర్కొంది. 

'భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య వార్నర్‌ పార్క్‌ మైదానంలో మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌ కూడా ఆలస్యం కానుంది. గంటన్నర ఆలస్యంగా మ్యాచ్ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు కాకుండా 9.30 గంటలకు ఆరంభమవుతుంది. లగేజీ సమస్యతో రెండో టీ20 మ్యాచ్‌ ఆలస్యంగా ముగిసింది. మూడో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు విశ్రాంతినిస్తామని చెప్పడంతోనే.. ఇరు జట్లు ఈరోజు టీ20 ఆడేందుకు అంగీకరించాయి' అని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు చెప్పారు. 

Also Read: Sweeper to Manager: ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌.. ఇప్పుడు మేనేజర్‌! ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఇదే  

Also Read: పనస పండ్ల కోసం ఏనుగు తిప్పలు.. ఏకంగా చెట్టు ఎక్కి మరీ తెంపిందిగా (వీడియో)

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News